వారి సమాచారం ఇస్తే రూ. 25 లక్షలు | Punjab Govt announced a reward of Rs 25 lakhs | Sakshi
Sakshi News home page

వారి సమాచారం ఇస్తే రూ. 25 లక్షలు

Published Sun, Nov 27 2016 4:06 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

వారి సమాచారం ఇస్తే రూ. 25 లక్షలు

వారి సమాచారం ఇస్తే రూ. 25 లక్షలు

అమృత్‌సర్: పంజాబ్లో జైలు నుంచి ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్మిందర్ మింటూతో పాటు మరికొందరు పారిపోయిన ఘటనలో పోలీసులు తీవ్ర గాలింపు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జైలు నుంచి పారిపోయిన వారి సమాచారం అందించిన వారి రూ 25 లక్షల రివార్డు అందిస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం ఉదయం నభా జైలుపై సాయుధులు దాడి చేసి హర్మిందర్‌ మింటూతో పాటు మరో నలుగురిని జైలు నుంచి విడిపించుకొని వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.
 
జైలు నుంచి పారిపోయిన కోసం సోదాలు నిర్వహిస్తున్న సమయంలో.. ఓ చోట ఆపకుండా వెళ్లిన కారుపై పోలీసులు కాల్పులు జరపడంతో ఓ మహిళ మృతి చెందినట్లు సమాచారం. కాగా జైల్ బ్రేక్ ఘటనలో ప్రభుత్వ హస్తముందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement