jailbreak
-
పోలీస్ స్టేషన్‌కు తుపాకులతో వచ్చి..
జైపూర్: సాయుధులైన పది మంది ఏకే–47 రైఫిల్‌తో పోలీస్‌స్టేషన్‌పై కాల్పులు జరిపి జైల్లో ఉన్న నిందితున్ని తమతో తీసుకెళ్లిన ఘటన రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా విక్రమ్ గుజ్జర్ (28, పప్లాగా సుపరిచితుడు) వాహనంలో రూ. 30 లక్షలు పట్టుకున్నారు. అనంతరం డబ్బును సీజ్ చేసి పప్లాను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు ఆతన్ని విచారిస్తుండగా, సాయుధులైన దాదాపు 15 మంది దుండగులు ఏకే 47 రైఫిళ్లతో పోలీస్‌స్టేషన్‌లోకి ప్రవేశించారు. దాదాపు 45 రౌండ్లు కాల్పులు జరిపి పప్లాను తీసుకొని ఉడాయించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. తప్పించుకున్న వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి సుగన్ సింగ్ అన్నారు. హరియాణాకు చెందిన పప్లా మీద ఇప్పటికే అయిదు హత్యా నేర అభియోగాలున్నాయి. ఆయుధాలు ధరించిన ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటాడు. అతడిపై రూ. లక్ష రివార్డు కూడా ఉంది. -
'ప్రభుత్వ సహకారంతోనే జైల్ బ్రేక్'
-
వారి సమాచారం ఇస్తే రూ. 25 లక్షలు
అమృత్సర్: పంజాబ్‌లో జైలు నుంచి ఖలిస్థాన్ ఉగ్రవాది హర్మిందర్ మింటూతో పాటు మరికొందరు పారిపోయిన ఘటనలో పోలీసులు తీవ్ర గాలింపు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జైలు నుంచి పారిపోయిన వారి సమాచారం అందించిన వారి రూ 25 లక్షల రివార్డు అందిస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం ఉదయం నభా జైలుపై సాయుధులు దాడి చేసి హర్మిందర్ మింటూతో పాటు మరో నలుగురిని జైలు నుంచి విడిపించుకొని వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. జైలు నుంచి పారిపోయిన కోసం సోదాలు నిర్వహిస్తున్న సమయంలో.. ఓ చోట ఆపకుండా వెళ్లిన కారుపై పోలీసులు కాల్పులు జరపడంతో ఓ మహిళ మృతి చెందినట్లు సమాచారం. కాగా జైల్ బ్రేక్ ఘటనలో ప్రభుత్వ హస్తముందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. -
'ప్రభుత్వ సహకారంతోనే జైల్ బ్రేక్'
అమృత్సర్: నభా జైలు నుంచి ఖలిస్థాన్ ఉగ్రవాది హర్మిందర్ మింటూతో పాటు మరో నలుగురు నేరగాళ్లు పరారైన ఘటనలో ప్రభుత్వ హస్తం ఉందని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరిందర్ సింగ్ ఆరోపించారు. హై సెక్యూరిటీ జైలులోకి గ్యాంగ్ స్టర్లు ప్రవేశించి ఉగ్రవాదిని విడిపించుకెళ్లిన తీరు.. ప్రభుత్వ భాగస్వామ్యాన్ని స్పష్టం చేస్తుందని అమరిందర్ సింగ్ అన్నారు. త్వరలో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రంలో మరోసారి ఉగ్రవాదం వ్యాపిస్తుందని ఆయన ఆందోళన వ్యక్త చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని అమరిందర్ సింగ్ విమర్శించారు. 'గ్యాంగ్ స్టర్లు ఏమాత్రం భయం లేకుండా జైలు లోకి ప్రవేశించడం.. మింటూతో పాటు మరికొందరిని విడిపించుకొని తీసుకెళ్తున్నా వారిని అడ్డుకోకపోవడం చూస్తుంటే ఉన్నత అధికారుల స్థాయిలో ముందుగా ప్లాన్ చేసి.. ఈ చర్యకు పాల్పడినట్లు స్పష్టమవుతుంది' అని ఆదివారం పాత్రికేయులతో మాట్లాడుతూ అమరిందర్ సింగ్ ఆరోపించారు. -
జార్ఖండ్‌లో 15 మంది ఖైదీల పరారీ