పోలీస్‌ స్టేషన్‌కు తుపాకులతో వచ్చి.. | Criminal Escapes From Lock-Up In Daring Jailbreak | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌కు తుపాకులతో వచ్చి..

Published Sat, Sep 7 2019 4:02 AM | Last Updated on Sat, Sep 7 2019 9:13 AM

Criminal Escapes From Lock-Up In Daring Jailbreak - Sakshi

జైపూర్‌: సాయుధులైన పది మంది ఏకే–47 రైఫిల్‌తో పోలీస్‌స్టేషన్‌పై కాల్పులు జరిపి జైల్లో ఉన్న నిందితున్ని తమతో తీసుకెళ్లిన ఘటన రాజస్తాన్‌లోని అల్వార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తుండగా విక్రమ్‌ గుజ్జర్‌ (28, పప్లాగా సుపరిచితుడు) వాహనంలో రూ. 30 లక్షలు పట్టుకున్నారు. అనంతరం డబ్బును సీజ్‌ చేసి పప్లాను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.

పోలీసులు ఆతన్ని విచారిస్తుండగా, సాయుధులైన దాదాపు 15 మంది దుండగులు ఏకే 47 రైఫిళ్లతో పోలీస్‌స్టేషన్‌లోకి ప్రవేశించారు. దాదాపు 45 రౌండ్లు కాల్పులు జరిపి పప్లాను తీసుకొని ఉడాయించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. తప్పించుకున్న వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి సుగన్‌ సింగ్‌ అన్నారు.  హరియాణాకు చెందిన పప్లా మీద ఇప్పటికే అయిదు హత్యా నేర అభియోగాలున్నాయి. ఆయుధాలు ధరించిన ఫొటోలను  తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటాడు. అతడిపై రూ. లక్ష రివార్డు కూడా   ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement