lock-up
-
పోలీస్ స్టేషన్‌కు తుపాకులతో వచ్చి..
జైపూర్: సాయుధులైన పది మంది ఏకే–47 రైఫిల్‌తో పోలీస్‌స్టేషన్‌పై కాల్పులు జరిపి జైల్లో ఉన్న నిందితున్ని తమతో తీసుకెళ్లిన ఘటన రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా విక్రమ్ గుజ్జర్ (28, పప్లాగా సుపరిచితుడు) వాహనంలో రూ. 30 లక్షలు పట్టుకున్నారు. అనంతరం డబ్బును సీజ్ చేసి పప్లాను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు ఆతన్ని విచారిస్తుండగా, సాయుధులైన దాదాపు 15 మంది దుండగులు ఏకే 47 రైఫిళ్లతో పోలీస్‌స్టేషన్‌లోకి ప్రవేశించారు. దాదాపు 45 రౌండ్లు కాల్పులు జరిపి పప్లాను తీసుకొని ఉడాయించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. తప్పించుకున్న వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి సుగన్ సింగ్ అన్నారు. హరియాణాకు చెందిన పప్లా మీద ఇప్పటికే అయిదు హత్యా నేర అభియోగాలున్నాయి. ఆయుధాలు ధరించిన ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటాడు. అతడిపై రూ. లక్ష రివార్డు కూడా ఉంది. -
మంగళగిరిలో లాకప్‌డెత్!
మంగళగిరి(గుంటూరు): మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మండలంలోని కురగళ్లు గ్రామానికి చెందిన ఎన్. వెంకటేశ్వరరావును పోలీసులు గురువారం స్టేషన్‌కు తీసుకొచ్చారు. వెంకటేశ్వర రావు, గంగమ్మ దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఇరువురి మధ్య గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన వెంకటేశ్వరరావు గంగమ్మ పై కిరోసిన్ పోసి నిప్పంటించడానికి యత్నించాడు. దీంతో అతని బారి నుంచి తప్పించుకున్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని స్టేషన్‌కు తీసుకొచ్చారు. కాగా శుక్రవారం ఉదయం వెంకటేశ్వరరావు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీంతో ఆయన బంధవులు పోలీసులే కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం తాము సాయంత్రం వరకు అదుపులో ఉంచుకొని రాత్రి పంపంచేశామని అంటున్నారు. -
పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతి
-
పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతి
⇒ లాకప్ డెత్ అంటున్న మృతుడి బంధువులు ⇒ మంగళహాట్ పీఎస్‌లో ఘటన సాక్షి, హైదరాబాద్: మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే పోలీసులే కొట్టి లాకప్ డెత్ చేశారంటూ అతని బంధువులు ఆం దోళనకు దిగడంతో అటు పోలీస్‌స్టేషన్ ఇటు మృతదేహాన్ని తరలించిన ఉస్మానియా ఆస్పత్రి ఆందోళనలతో అట్టుడికిపోయాయి. పోలీసులను సైతం మృతుడి బంధువులు ఉరుకులు పరుగులు పెట్టించారు. ధూల్‌పేట్ రహింపు రాకు చెందిన భీమ్‌సింగ్(45), బేగంబజార్ లోని దినేశ్ భారత్‌లు మిత్రులు. ఇటీవలే దినేశ్ భారత్ తన కూతురి వివాహం చేశాడు. శుక్ర వారం రాత్రి ధూల్‌పేట్‌కు వచ్చిన దినేశ్ భారత్ ను కూతురి వివాహం చేసి దావత్ ఎందుకి వ్వలేదంటూ భీమ్ సింగ్ సరదాగా నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్యా దావత్ విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది. తాగిన మత్తులో భీమ్ సింగ్ దినేశ్ భారత్‌పై దాడి చేశాడు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో దినేశ్ భారత్ మంగళ్‌హాట్ పోలీసులకు ఫిర్యా దు చేశాడు. దీంతో ఎస్సై శివ భీమ్ సింగ్‌ను పిలిపించి కేసు విషయమై మాట్లాడాడు. ఆధార్ తెచ్చుకుంటే విడిచిపెడతానని ఎస్సై హామీ ఇచ్చాడు. ఇంతలో పోలీస్ స్టేషన్లో ఉన్న బాత్రూంలోకి వెళ్లిన భీమ్ సింగ్ అందు లోనే కుప్పకూలాడు. శబ్దం రావడంతో అక్కడు న్న ఓ వ్యక్తి ఎస్సై శివకు చెప్పడంతో బాత్ రూంలో పడిపోయి ఉన్న భీమ్ సింగ్‌ను పోలీస్ సిబ్బందితో కలసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే భీమ్ సింగ్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బంధువుల ఆందోళన, ఆస్పత్రి ధ్వంసం.. భీమ్ సింగ్ లాకప్‌డెత్‌కు కారకులైన పోలీసు లపై చర్యలు తీసుకోవాలని బంధువులు, స్థానికులు ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళ నకు దిగారు. భీమ్‌సింగ్ భార్య గంగాభాయ్ రాకతో మరింత రెచ్చిపోయి ఆస్పత్రిలోని క్యాజువాలిటీ గది తలుపును, బోర్డును, వీల్చైర్లను ధ్వంసం చేశారు. డ్యూటీలో ఉన్న పోలీసులు, సిబ్బందిపై దాడులకు దిగారు. మార్చురీ వద్ద దాదాపు 3 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఎమ్మెల్యే రాజాసింగ్ లోథాతో కలసి వందలాదిమంది ఆందోళన చేపట్టడంతో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్రాజుతో ఆందోళన కారులు వాగ్వాదానికి దిగారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మంగళ్‌హాట్ ప్రధాన రోడ్లు మూసేశారు. మీడియాకు స్టేషన్‌లోని సీసీ ఫుటేజీ భీమ్ సింగ్‌తో ఎస్సై శివ మాట్లాడిన దృశ్యాలు, అతను బాత్ రూంలోకి వెళ్లిన దృశ్యాలు, అతడు ఆస్పత్రికి వెళ్లిన దృశ్యాలను సీసీ ఫుటేజీల రికార్డులను ఏసీపీ రాంభూపాల్‌రావు మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా ఏసీపీ రాంభూపాల్‌రావు మాట్లాడుతూ.. దినేశ్ భారత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమ్‌సింగ్‌పై ఐపీసీ 324, 506, 341 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. కేసులు నమోదైనప్పుడు వ్యక్తిని పిలిచి విచారించడం పోలీసుల బాధ్యత అని అన్నారు. భీమ్‌సింగ్ అప్పటికే తాగి ఉన్నా డని, అతని ఆరోగ్యం కూడా సరిగాలే దన్నారు. అతన్ని ఎవరూ కొట్టలేదని ఆయన తెలిపారు. భీమ్ సింగ్ మృతిపై పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదికలో తెలుస్తా యని ఏసీపీ వెల్లడించారు. -
పోలీస్ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం
‘జపాన్’ విధానం అమలుకు నగర సీపీ కసరత్తు తొలివిడతగా అధికారులకు ప్రత్యేక శిక్షణ బాధితుల పట్ల మర్యాదగా ఉండాలని సీపీ మహేందర్‌రెడ్డి సూచన సాక్షి, సిటీబ్యూరో: పోలీసు స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది పనితీరులో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు నగర పోలీసు కమిషనర్ కసరత్తు చేస్తున్నారు. పోలీసు స్టేషన్‌కు, పోలీసు అధికారి కార్యాలయానికి ఎవరు వచ్చినా మర్యాదగా వ్యవహరించాలని, అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచాలని కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇక్కడ ‘జపాన్ కైజన్ టెక్నిక్’ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా సిబ్బందితోపాటు అధికారుల్లో క్రమశిక్షణ అలవరుతుందని, కార్యాలయాల పనితీరులో మార్పు వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం ప్రతి అధికారికి శిక్షణ ఇవ్వాలని కమిషనర్ నిర్ణయించారు. ఈ మేరకు తొలివిడతగా శుక్రవారం జీడిమెట్లలోని ‘ఉషా శ్రీరామ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’లో అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇందులో అదనపు పోలీసు కమిషనర్లు, జాయింట్ పోలీసు కమిషనర్లు, డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీ స్థాయి అధికారులు పాల్గొన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులకు అవసరమైన సహాయం చేయడం పోలీసు విధిగా భావించాలని, బాధితుడికి ఊర ట కలిగించేందుకు సిబ్బంది పనితీరులో మార్పులు రావాలని కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచించారు. స్టేషన్‌కు వచ్చే వారిని మర్యాదగా పలుకరించేందుకు రిసెప్షన్ వ్యవస్థను మరిత పటిష్టపరచనున్నారు. బాధితుడు కేసు పెట్టిన తరువాత ఆ కేసు పురోగతి కోసం స్టేషన్‌కు వస్తే వివరాలు అందుబాటులో ఉండేలా ఠాణాలను తీర్చిదిద్దాలన్నారు. స్టేషన్లో రికవరీ వాహనాలు, ఇతర సామగ్రిని ఎక్కడపడితే అక్కడ వేయకుండా క్రమపద్ధతిలో పెట్టాలని సూచించారు. లాకప్, రైటర్, రిసెప్షన్, ఎస్హెచ్ఓ, ఎస్ఐల గదులను శుభ్రంగా ఉంచుకోవాలని, కేసు రిజిస్టర్ చేయడం, పెండింగ్ వారెంట్లు, చార్జిషీట్ దాఖలు, పాత నేరస్తుల పట్టిక, రౌడీషీటర్ల జాబితా తదితర ఫైళ్లను క్రమపద్ధతిలో భద్రపరచాలన్నారు. స్టేషన్ నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం నెలకు రూ.10 వేల చొప్పున ఇస్తుందని, ఈ డబ్బు సరిపోనందున కనీసం నెలకు రూ.75 వేల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వం నియమించిన పోలీసు టాస్క్‌ఫోర్స్ కమిటీ అభిప్రాయపడిందని ఆయన గుర్తుచేశారు. తాను సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో అక్కడ ప్రవేశపెట్టిన కల్చర్ చేంజ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ద్వారా ఆశించిన విజయాలు సాధించినట్టు చెప్పారు. కమిషనర్ ‘5-ఎస్’ సూత్రం.. ఎస్- సార్టింగ్ (కేసుల విభజన) ఎస్- సిస్టమైజేషన్ (పకడ్బందీగా విధానాల అమలు) ఎస్- షైనింగ్ (ముఖ్యమైన కేసుల తక్షణ గుర్తింపు) ఎస్- స్టాండడైజేషన్ (అత్యున్నత ప్రమాణాలు, పద్ధతులు పాటించడం) ఎస్- సెల్ఫ్ డిసిప్లేన్ (వ్యక్తిగత క్రమశిక్షణ పాటించడం) -
లాకప్‌లో ఆత్మహత్య
జంగారెడ్డిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులో జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురానికి చెందిన మారిశెట్టి రాజేష్(28)ను కొన్ని రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లాకప్‌లో ఉన్న రాజేష్ శనివారం ఉదయం అందులోనే వున్న బైక్‌లలోని పెట్రోల్ తీసుకుని ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. 75 శాతం కాలిన గాయాలైన రాజేష్‌ను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసుల చిత్రహింసలకు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశానని అతను వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. కానీ, తమను బెదిరించటానికని ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
లాకప్ నుంచి దొంగ పరారీ
జిల్లా పోలీసుల పరువు మరోసారి మంటకలిసింది. నిత్యం నిఘా నేత్రంలో ఉండే ఏలూరు నగరంలోని పోలీస్ లాకప్ నుంచి అంతర్‌జిల్లాల దొంగ తప్పించుకుని పరారవడం సంచలనం సృష్టించింది. నరసాపురంలో పోలీస్‌స్టేషన్‌కు కన్నం వేసి పారిపోయిన దొంగల విషయాన్ని ప్రజలు మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది. ఏలూరు (టూటౌన్), న్యూస్‌లైన్ :ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ లాకప్‌లో ఉన్న అంతర్‌జిల్లాల దొంగ యర్రంశెట్టి రాజేష్ (కుక్కల రాజేష్) అనే నిందితుడు మంగళవారం రాత్రి కిటికీ ఊచలు వంచి పరారవడంతో జిల్లా పోలీసులు ఖంగుతిన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 10న యర్రంశెట్టి రాజేష్, షేక్ నాగూర్‌ఖాన్ కలిసి ఏలూరు శాంతినగర్ ఐదో రోడ్డులోని డాక్టర్ వి.అనీల ఇంటిలో 90 కాసుల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. దీనిపై కేసు నమోదైంది. డిసెంబర్ 17న పోలీసులు నాగూర్ఖాన్ను అరెస్ట్ చేసి 30 కాసులను రికవరీ చేశారు. అప్పటి నుంచి రాజేష్ కోసం గాలించారు. మూడు రోజుల క్రితం రాజేష్‌ను పోలీసులు ఏలూరులో అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లోని లాకప్ గదిలో ఉంచారు. ఇతడు ఐపీసీ 299/13 కేసులో నిందితుడిగా నమోదై ఉన్నాడు. అతడిపై జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా అనేక కేసులు ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మంగళవారం రాత్రి పోలీసులు నగరంలో అల్లర్లు జరగకుండా గస్తీ కాస్తున్నారు. త్రీటౌన్ స్టేషన్లో సెంట్రీగా శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన రాజేష్ లాకప్‌లోని కిటికీ ఊచలను వంచి అందులో నుంచి పారిపోయాడు. నిందితుడు పారిపోవడాన్ని చూసిన కానిస్టేబుల్ అతడిని పట్టుకునేందుకు యత్నించినప్పటికీ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. రాజేష్ తప్పించుకోవడం రెండోసారి! యర్రంశెట్టి రాజేష్ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2012 లో ఓ దొంగతనం కేసులో రాజేష్, మరో ఇద్దరు దొంగలను త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్లో వీరిని ఉంచేందుకు స్థలం సరిపోకపోవడంతో వారిని వన్‌టౌన్ స్టేషన్లో ఉంచారు. అదే రోజు రాత్రి బాత్రూమ్లోని కిటీకీ ఊచలను వంచి ముగ్గురు నిందితులూ పారిపోయారు. సీఐ, ఎస్సైల మధ్య విభేదాలే కారణమా? రెండు నెలల నుంచి త్రీటౌన్ సీఐకి, స్థానిక ఎస్సైకి మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 7న విధుల్లో చేరిన సీఐ శ్రీనివాస్‌కు ఎస్సై శ్రీనివాస్‌కు పొసగడం లేదని, అనేక వివాదాలు జరుగుతున్నాయని స్టేషన్‌లోని సిబ్బందే చెబుతున్నారు. రాజేష్ పరారీకి వీరిద్దని నిర్లక్ష్యం కూడా కారణం అయి ఉండవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేషన్ సిబ్బందిపై విచారణ చేపట్టి వారిపై తగిన చర్యలు తీసుకుంటామంటూ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎస్పీ హరికృష్ణ పరిశీలన అంతర్‌జిల్లాల దొంగ పరారైన త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ హరికృష్ణ బుధవారం సాయంత్రం పరిశీలించారు. లాకప్, స్టేషన్ పరిసరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అదే లాకప్‌లో ఉన్న మరో నిందితుడిని ఎస్పీ విచారించారు. అనంతరం సీఐ, ఎస్సైలను విచారిం చారు. ఏఎస్పీ చంద్రశేఖర్, ఏలూరు డీఎస్పీ సత్తిబాబు ఆయన వెంట ఉన్నారు.