మంగళగిరిలో లాకప్‌డెత్‌! | Lakap death in mangalagirilo! | Sakshi
Sakshi News home page

మంగళగిరిలో లాకప్‌డెత్‌!

Published Fri, Apr 7 2017 11:35 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

Lakap  death in  mangalagirilo!

మంగళగిరి(గుంటూరు):  మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మండలంలోని కురగళ్లు గ్రామానికి చెందిన ఎన్‌. వెంకటేశ్వరరావును పోలీసులు గురువారం స్టేషన్‌కు తీసుకొచ్చారు. వెంకటేశ్వర రావు, గంగమ్మ దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
 
ఈ క్రమంలో గురువారం ఇరువురి మధ్య గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన వెంకటేశ్వరరావు గంగమ్మ పై కిరోసిన్‌ పోసి నిప్పంటించడానికి యత్నించాడు. దీంతో అతని బారి నుంచి తప్పించుకున్న భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని స్టేషన్‌కు తీసుకొచ్చారు. కాగా శుక్రవారం ఉదయం వెంకటేశ్వరరావు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీంతో ఆయన బంధవులు పోలీసులే కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం తాము సాయంత్రం వరకు అదుపులో ఉంచుకొని రాత్రి పంపంచేశామని అంటున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement