
పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మృతి
⇒ లాకప్ డెత్ అంటున్న మృతుడి బంధువులు
⇒ మంగళహాట్ పీఎస్‌లో ఘటన
సాక్షి, హైదరాబాద్: మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయితే పోలీసులే కొట్టి లాకప్ డెత్ చేశారంటూ అతని బంధువులు ఆం దోళనకు దిగడంతో అటు పోలీస్‌స్టేషన్ ఇటు మృతదేహాన్ని తరలించిన ఉస్మానియా ఆస్పత్రి ఆందోళనలతో అట్టుడికిపోయాయి. పోలీసులను సైతం మృతుడి బంధువులు ఉరుకులు పరుగులు పెట్టించారు. ధూల్‌పేట్ రహింపు రాకు చెందిన భీమ్‌సింగ్(45), బేగంబజార్ లోని దినేశ్ భారత్‌లు మిత్రులు. ఇటీవలే దినేశ్ భారత్ తన కూతురి వివాహం చేశాడు. శుక్ర వారం రాత్రి ధూల్‌పేట్‌కు వచ్చిన దినేశ్ భారత్ ను కూతురి వివాహం చేసి దావత్ ఎందుకి వ్వలేదంటూ భీమ్ సింగ్ సరదాగా నిలదీశాడు.
దీంతో ఇద్దరి మధ్యా దావత్ విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది. తాగిన మత్తులో భీమ్ సింగ్ దినేశ్ భారత్‌పై దాడి చేశాడు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో దినేశ్ భారత్ మంగళ్‌హాట్ పోలీసులకు ఫిర్యా దు చేశాడు. దీంతో ఎస్సై శివ భీమ్ సింగ్‌ను పిలిపించి కేసు విషయమై మాట్లాడాడు. ఆధార్ తెచ్చుకుంటే విడిచిపెడతానని ఎస్సై హామీ ఇచ్చాడు. ఇంతలో పోలీస్ స్టేషన్‌లో ఉన్న బాత్‌రూంలోకి వెళ్లిన భీమ్ సింగ్ అందు లోనే కుప్పకూలాడు. శబ్దం రావడంతో అక్కడు న్న ఓ వ్యక్తి ఎస్సై శివకు చెప్పడంతో బాత్ రూంలో పడిపోయి ఉన్న భీమ్ సింగ్‌ను పోలీస్ సిబ్బందితో కలసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే భీమ్ సింగ్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
బంధువుల ఆందోళన, ఆస్పత్రి ధ్వంసం..
భీమ్ సింగ్ లాకప్‌డెత్‌కు కారకులైన పోలీసు లపై చర్యలు తీసుకోవాలని బంధువులు, స్థానికులు ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఆందోళ నకు దిగారు. భీమ్‌సింగ్ భార్య గంగాభాయ్ రాకతో మరింత రెచ్చిపోయి ఆస్పత్రిలోని క్యాజువాలిటీ గది తలుపును, బోర్డును, వీల్‌చైర్‌లను ధ్వంసం చేశారు. డ్యూటీలో ఉన్న పోలీసులు, సిబ్బందిపై దాడులకు దిగారు. మార్చురీ వద్ద దాదాపు 3 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా అఫ్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.
పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
ఎమ్మెల్యే రాజాసింగ్ లోథాతో కలసి వందలాదిమంది ఆందోళన చేపట్టడంతో పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్‌రాజుతో ఆందోళన కారులు వాగ్వాదానికి దిగారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మంగళ్‌హాట్ ప్రధాన రోడ్లు మూసేశారు.
మీడియాకు స్టేషన్‌లోని సీసీ ఫుటేజీ
భీమ్ సింగ్‌తో ఎస్సై శివ మాట్లాడిన దృశ్యాలు, అతను బాత్ రూంలోకి వెళ్లిన దృశ్యాలు, అతడు ఆస్పత్రికి వెళ్లిన దృశ్యాలను సీసీ ఫుటేజీల రికార్డులను ఏసీపీ రాంభూపాల్‌రావు మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా ఏసీపీ రాంభూపాల్‌రావు మాట్లాడుతూ.. దినేశ్ భారత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమ్‌సింగ్‌పై ఐపీసీ 324, 506, 341 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. కేసులు నమోదైనప్పుడు వ్యక్తిని పిలిచి విచారించడం పోలీసుల బాధ్యత అని అన్నారు. భీమ్‌సింగ్ అప్పటికే తాగి ఉన్నా డని, అతని ఆరోగ్యం కూడా సరిగాలే దన్నారు. అతన్ని ఎవరూ కొట్టలేదని ఆయన తెలిపారు. భీమ్ సింగ్ మృతిపై పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదికలో తెలుస్తా యని ఏసీపీ వెల్లడించారు.