armed attackers
-
పోలీస్ స్టేషన్‌కు తుపాకులతో వచ్చి..
జైపూర్: సాయుధులైన పది మంది ఏకే–47 రైఫిల్‌తో పోలీస్‌స్టేషన్‌పై కాల్పులు జరిపి జైల్లో ఉన్న నిందితున్ని తమతో తీసుకెళ్లిన ఘటన రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా విక్రమ్ గుజ్జర్ (28, పప్లాగా సుపరిచితుడు) వాహనంలో రూ. 30 లక్షలు పట్టుకున్నారు. అనంతరం డబ్బును సీజ్ చేసి పప్లాను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు ఆతన్ని విచారిస్తుండగా, సాయుధులైన దాదాపు 15 మంది దుండగులు ఏకే 47 రైఫిళ్లతో పోలీస్‌స్టేషన్‌లోకి ప్రవేశించారు. దాదాపు 45 రౌండ్లు కాల్పులు జరిపి పప్లాను తీసుకొని ఉడాయించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. తప్పించుకున్న వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి సుగన్ సింగ్ అన్నారు. హరియాణాకు చెందిన పప్లా మీద ఇప్పటికే అయిదు హత్యా నేర అభియోగాలున్నాయి. ఆయుధాలు ధరించిన ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటాడు. అతడిపై రూ. లక్ష రివార్డు కూడా ఉంది. -
మాలి జాతి ఘర్షణల్లో 50 మంది దుర్మరణం
బమాకో: ఆఫ్రికాదేశమైన మాలి మరోసారి నెత్తురోడింది. మాలిలోని ఫులానీ తెగకు చెందిన ఒగౌస్సగౌ గ్రామంపై శనివారం తెల్లవారుజామున 4 గంటలకు డోగోన్ జాతికి చెందిన వేటగాళ్లు దాడిచేశారు. విచక్షణారహితంగా తుపాకులతో కాల్పులు జరుపుతూ నివాసాలకు నిప్పుపెట్టారు. ఈ దుర్ఘటనలో 50 మంది ఫులానీ తెగప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పశువుల మేత, నీటి విషయంలో ఈ రెండు తెగల మధ్య కొన్నేళ్లుగా ఘర్షణలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో చోటుచేసుకున్న ఘర్షణలో డోగోన్ వేటగాళ్లు 37 మంది ఫులానీ ప్రజలను చంపేశారన్నారు. ఈ ప్రాంతంలోని జాతివైరాన్ని అల్‌కాయిదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రసంస్థలు పావుగా వాడుకుంటూ భారీగా చేరికలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. -
కోర్టులో ఆగంతకులు కాల్పులు: ముగ్గురు మృతి
పాకిస్థాన్ కోర్టు తుపాకుల కాల్పులతో దద్దరిల్లింది. ఆ కాల్పులలో పోలీసు, ఖైదీతోపాటు ఓ పౌరుడు మృతి చెందారు. ఆ ఘటన రావల్పిండిలోని స్థానిక కోర్టులో శుక్రవారం చోటు చేసుకుందని డాన్ పత్రిక వెల్లడించింది. స్థానిక కోర్టులో ఈ రోజు ప్రశాంతంగా ఓ కేసు విచారణ కొనసాగుతుంది. అయితే అప్పటికే కోర్టు హాల్లోకి ప్రవేశించిన ఆగంతకులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దాంతో కోర్టులోని వారంత ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపి....నలుగురు నిందితలను ఆదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. అయితే ఆ దాడికి పాల్పడింది తామేనంటూ ఇంత వరకు ఏ సంస్థ ప్రకటించ లేదని డాన్ పేర్కొంది. ఆ సంఘటనలో గాయపడిన వారు పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.