మాలి జాతి ఘర్షణల్లో 50 మంది దుర్మరణం | About 115 killed in apparent ethnic attack in Mali | Sakshi
Sakshi News home page

మాలి జాతి ఘర్షణల్లో 50 మంది దుర్మరణం

Published Sun, Mar 24 2019 5:10 AM | Last Updated on Sun, Mar 24 2019 5:10 AM

About 115 killed in apparent ethnic attack in Mali - Sakshi

బమాకో: ఆఫ్రికాదేశమైన మాలి మరోసారి నెత్తురోడింది. మాలిలోని ఫులానీ తెగకు చెందిన ఒగౌస్సగౌ గ్రామంపై శనివారం తెల్లవారుజామున 4 గంటలకు డోగోన్‌ జాతికి చెందిన వేటగాళ్లు దాడిచేశారు. విచక్షణారహితంగా తుపాకులతో కాల్పులు జరుపుతూ నివాసాలకు నిప్పుపెట్టారు. ఈ దుర్ఘటనలో 50 మంది ఫులానీ తెగప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పశువుల మేత, నీటి విషయంలో ఈ రెండు తెగల మధ్య కొన్నేళ్లుగా ఘర్షణలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో చోటుచేసుకున్న ఘర్షణలో డోగోన్‌ వేటగాళ్లు 37 మంది ఫులానీ ప్రజలను చంపేశారన్నారు. ఈ ప్రాంతంలోని జాతివైరాన్ని అల్‌కాయిదా, ఇస్లామిక్‌ స్టేట్‌ వంటి ఉగ్రసంస్థలు పావుగా వాడుకుంటూ భారీగా చేరికలు చేపడుతున్నాయని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement