పాకిస్థాన్ కోర్టు తుపాకుల కాల్పులతో దద్దరిల్లింది. ఆ కాల్పులలో పోలీసు, ఖైదీతోపాటు ఓ పౌరుడు మృతి చెందారు. ఆ ఘటన రావల్పిండిలోని స్థానిక కోర్టులో శుక్రవారం చోటు చేసుకుందని డాన్ పత్రిక వెల్లడించింది. స్థానిక కోర్టులో ఈ రోజు ప్రశాంతంగా ఓ కేసు విచారణ కొనసాగుతుంది. అయితే అప్పటికే కోర్టు హాల్లోకి ప్రవేశించిన ఆగంతకులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు.
దాంతో కోర్టులోని వారంత ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురు కాల్పులు జరిపి....నలుగురు నిందితలను ఆదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. అయితే ఆ దాడికి పాల్పడింది తామేనంటూ ఇంత వరకు ఏ సంస్థ ప్రకటించ లేదని డాన్ పేర్కొంది. ఆ సంఘటనలో గాయపడిన వారు పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
కోర్టులో ఆగంతకులు కాల్పులు: ముగ్గురు మృతి
Published Fri, Apr 11 2014 1:21 PM | Last Updated on Sat, Mar 23 2019 8:23 PM
Advertisement