బగ్ కనిపెడితే, గూగుల్ భారీ రివార్డు
బగ్ కనిపెడితే, గూగుల్ భారీ రివార్డు
Published Sat, Jun 3 2017 5:23 PM | Last Updated on Sat, Aug 18 2018 4:44 PM
ఆండ్రాయిడ్ ఆధారితంగా నడిచే ఫోన్లకు ఇటీవల పెద్ద ముప్పే వచ్చిన పడిన సంగతితెలిసిందే. వన్నాక్రై సైబర్ ఎటాక్ నుంచి తేరుకోకముందే ఆండ్రాయిడ్ ఫోన్లను దెబ్బకొడుతూ గూగుల్ ప్లే స్టోర్ లోకి జుడీ అనే మాల్వేర్ ప్రవేశించింది. 3.65కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లు ఈ మాల్వేర్ ప్రభావానికి గురయ్యాయి. ఈ దాడితో అలర్ట్ అయిన గూగుల్ తమ ఆండ్రాయిడ్ ఓఎస్ లో బగ్ కనుకున్న వారికి భారీగా రివార్డు ఇవ్వాలని నిర్ణయించిందట. ప్రస్తుతమున్న రివార్డును రెండు లక్షల డాలర్లకు అంటే దేశీయ కరెన్సీ ప్రకారం 1,28,83,000కు పెంచినట్టు రిపోర్టులు వెలువడ్డాయి. సైబర్ సెక్యురిటీ సంస్థ చెక్ పాయింట్ ప్రకారం ప్లే స్టోర్ నుంచి 45 లక్షల నుంచి 1.85 కోట్ల హానికరమైన యాప్స్ డౌన్ లోడ్ అయినట్టు తెలిసింది. పాతకాలపు ఓఎస్ లతో ఎక్కువగా సెక్యురిటీ ముప్పు తలెత్తుందని టెక్నాలజీ వెబ్ సైట్ ఎక్స్ ట్రీమ్ టెక్.కామ్ శుక్రవారం రిపోర్టు ఏసింది.
కొన్ని సంవత్సరాల క్రితం గూగుల్ అందించిన వాటికంటే ప్రస్తుతం విడుదలచేస్తున్న ఆండ్రాయిడ్ లు ఎక్కువగా సురక్షితంగా ఉన్నాయని, దీంతో ఆండ్రాయిడ్ లో బగ్స్ కనుగొని ప్రయోజనాలు పొందడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలిసింది. కానీ బగ్ బాంటీ ప్రొగ్రామ్ ద్వారా ఎక్కువమంది రీసెర్చర్లను, ఇంజనీర్లను ఆకట్టుకోవడానికి కంపెనీ రివార్డును రెండు లక్షల డాలర్లకు పెంచినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. రెండేళ్ల క్రితం గూగుల్ ఈ బగ్ బాంటీ ప్రొగ్రామ్ ఆండ్రాయిడ్ ల కోసం ప్రారంభించింది. ఆండ్రాయిడ్స్ లో బగ్ కనుగొన్నవారికి నగదును బహుమతి అందిస్తోంది.
Advertisement