హర్మన్ ప్రీత్‌కు సీఎం నజరానా..
♦ రూ.5 లక్షలు ప్రకటించి పంజాబ్ ప్రభుత్వం
మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన హర్మన్ ప్రీత్‌కౌర్‌కు ఆదివారం పంజాబ్ ప్రభుత్వం రూ.5 లక్షల నజరానా ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో కౌర్ ఏకంగా 20 ఫోర్లు 7 సిక్సులతో 171 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోశించిన విషయం తెలిసిందే. కౌర్ సొంత రాష్ట్రం పంజాబ్ కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ప్రోత్సాహాకంగా రూ. 5 లక్షల రివార్డు ప్రకటించారు.
కౌర్ పంజాబీ బిడ్డ అయినందుకు గర్విస్తున్నాని, కౌర్ ప్రదర్శన పంజాబీలంతా గర్వించేలా చేసిందని సీఎం ఆమెకు అభినందనలు తెలిపారు. కౌర్ మరో అద్భుత ప్రదర్శనతో వరల్డ్ కప్ సాధిస్తుందని, కేరిర్‌లో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె తండ్రి హర్మందర్ సింగ్‌కు అభినందనలు తెలిపారని సీఎం అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.