CM Amarinder Singh
-
కల్తీ మద్యం: 86కి చేరిన మృతుల సంఖ్య
చండీగఢ్ : పంజాబ్‌లో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 86కు చేరింది. శుక్రవారం రాత్రి వరకు తార్న్‌తరన్‌లో 19, అమృత్‌సర్‌లో 11, బాటాల జిల్లాలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శనివారం తార్న్‌తరన్‌లో మరో 44 మంది, అమృత్‌సర్‌లో ఒకరు, బాటాల జిల్లాలో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 86కు చేరుకుంది. కల్తీ మద్యం కేసులో పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టడంతో విఫలమైన ఏడుగురు ఎక్సైజ్ అధికారులు, ఆరుగురు పోలీసులను ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సస్పెండ్ చేశారు. బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని ప్రకటించారు. -
హర్మన్ ప్రీత్‌కు సీఎం నజరానా..
♦ రూ.5 లక్షలు ప్రకటించి పంజాబ్ ప్రభుత్వం మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన హర్మన్ ప్రీత్‌కౌర్‌కు ఆదివారం పంజాబ్ ప్రభుత్వం రూ.5 లక్షల నజరానా ప్రకటించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో కౌర్ ఏకంగా 20 ఫోర్లు 7 సిక్సులతో 171 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోశించిన విషయం తెలిసిందే. కౌర్ సొంత రాష్ట్రం పంజాబ్ కావడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ప్రోత్సాహాకంగా రూ. 5 లక్షల రివార్డు ప్రకటించారు. కౌర్ పంజాబీ బిడ్డ అయినందుకు గర్విస్తున్నాని, కౌర్ ప్రదర్శన పంజాబీలంతా గర్వించేలా చేసిందని సీఎం ఆమెకు అభినందనలు తెలిపారు. కౌర్ మరో అద్భుత ప్రదర్శనతో వరల్డ్ కప్ సాధిస్తుందని, కేరిర్‌లో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె తండ్రి హర్మందర్ సింగ్‌కు అభినందనలు తెలిపారని సీఎం అధికార ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. -
ఇక హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మద్యం
ఛండీగఢ్: ఇక హైవేలపై ఉండే దాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మద్యం అందుబాటులో రానుంది. ఆయా ప్రదేశాల్లో లిక్కర్ అమ్మకాలకు అనుమతినిస్తూ పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం చట్టసవరణ చేసింది. సోమవారం ఛండీగఢ్‌లో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పంజాబ్ మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. కొద్ది నెలల కిందటే సుప్రీం కోర్టు.. జాతీయ రహదారులు, ఇతర హైవేలపై మద్యం అమ్మకాలను నిషేధించిన సంగతి తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా పంజాబ్ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏమరకు అమలవుతుందో వేచిచూడాలి. రైతుల రుణాలు మాఫీ ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన రైతులకు హామీ ఇచ్చిన విధంగా పంజాబ్ సర్కార్ రుణమాఫీ ప్రకటించింది. రాష్ట్రంలోని 8.75 లక్షల మంది చిన్నకారు, మధ్యతరహా రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు సీఎం అమరీందర్‌సింగ్ కేబినెట్ భేటీలో ప్రకటించారు. -
పంజాబ్ సీఎంకు మళ్లీ చుక్కెదురు!
న్యూఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అమరిందర్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఎంపీగా ఎన్నికైన సమయంలో ఇక్కడి జన్‌పథ్‌లో ఆయనకు ఏర్పాటు చేసిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అమరిందర్ సింగ్‌కు గతంలో ఇక్కడ కల్పించిన అధికారిక భవనంలో 2019 వరకు ఉండొచ్చునని మొదట ప్రకటించారు. కానీ ఎస్టేట్ ఆఫీసర్ మార్చ్ 24 ఆర్డర్ ప్రకారం ఆయన ఇక్కడ ఉండేందుకు అర్హుడుకాదని అప్పీల్ చేయగా, దీన్ని తాజాగా ఢిల్లీ కోర్టు విచారించింది. సీఎం అమరిందర్ జనపథ్‌లోని ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని సూచిస్తూ, ఆయన అనధికారికంగా ఉంటున్నారన్న వాదనను డిస్టిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి పూనమ్ ఏ బాంబా తోసిపుచ్చారు. అమరిందర్ గతేడాది నవంబర్ 23న తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయగా, డిసెంబర్ 23న ఆయనకు ఈ నివాసాన్ని రద్దుచేసిన విషయం తెలిసిందే. అనంతరం ఈ బంగ్లాను సీపీడబ్ల్యూడీకి అప్పగించాల్సి ఉండగా, తాను హై బీపీ, షూగర్ సమస్యలతో బాధపడుతున్నానని.. మానవతా దృక్పథంతో ఆలోచించి తనను మరికొంత కాలం ఉండేందుకు అనుమతించాలని అమరిందర్ విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ ఫిబ్రవరి 10న లోక్‌సభ చైర్మన్, హౌస్ కమిటీ ఎదుట ఆయన హాజరుకావాల్సి ఉండగా, అమరిందర్ గైర్హాజరవుతున్నారు. దీనిపై వివరణ కోరుతూ ఫిబ్రవరి 23 వరకు గడువిస్తూ ఫిబ్రవరి 14న షో కాజ్ నోటీసులు జారీ అయ్యాయి. తాజాగా ఈ విషయంపై విచారించిన ఢిల్లీ కోర్టు జనపథ్‌లోని బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది.