
చండీగఢ్ : పంజాబ్‌లో కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 86కు చేరింది. శుక్రవారం రాత్రి వరకు తార్న్‌తరన్‌లో 19, అమృత్‌సర్‌లో 11, బాటాల జిల్లాలో 9 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. శనివారం తార్న్‌తరన్‌లో మరో 44 మంది, అమృత్‌సర్‌లో ఒకరు, బాటాల జిల్లాలో ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 86కు చేరుకుంది. కల్తీ మద్యం కేసులో పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టడంతో విఫలమైన ఏడుగురు ఎక్సైజ్ అధికారులు, ఆరుగురు పోలీసులను ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సస్పెండ్ చేశారు. బాధ్యులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని ప్రకటించారు.