
న్యూఢిల్లీ : మెరుగైన సర్వీసులను అందిస్తూ.. డబ్బులు ఎలా సంపాదించుకోవాలి? అనే దాని కోసం దేశీయ రైల్వే వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. దీని కోసం ఓ పోటీని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మెరుగైన సర్వీసుల అందిస్తూ, నగదును ఎలా పెంచుకోవాలో దేశీయ రైల్వేకి ఐడియా చెబితే రూ.10 లక్షల రివార్డు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ పోటీలో పాల్గొనే వారు ఎంట్రీస్‌ను పోస్టు చేయడానికి ఈ రోజే తుది గడువు. ఈ పోటీలో పాల్గొనడానికి కొన్ని ఆచరణాత్మక ఆలోచనలను తమకు పంపించాలని రైల్వే పేర్కొంది. ఈ పోటీలో గెలుపొందిన తొలి విజేతకు రూ.10 లక్షలను, రెండో విజేతకు 5 లక్షల రూపాయలను, మూడో విజేతకు 3 లక్షల రూపాయలను, నాలుగో విజేతకు లక్ష రూపాయలను బహుమతిగా అందించనున్నట్టు తెలిపింది.
పోటీలో పాల్గొనే వారు ఆన్‌లైన్ అప్లికేషన్ సిస్టమ్‌లో ఎంట్రీస్‌ను పోస్టు చేయాల్సి ఉంటుంది. https://www.innovate.mygov.inలోకి వెళ్లి, ‘CLICK HERE TO PARTICIPATE’ బటన్‌న్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. పాల్గొనాల్సిన రిజిస్ట్రేషన్ దరఖాస్తును కూడా అభ్యర్థులు నింపాల్సి ఉంటుంది. కన్‌ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తర్వాత ఎంట్రీ సబ్మిషన్ ఫాంను వస్తోంది. అభ్యర్థులు మొబైల్ నెంబర్‌ను, ఈమెయిల్ ఐడీని సరియైనదిగా ఉండాలి. దేశీయ రైల్వే ఏదేనీ సమాచారం అభ్యర్థులకు అందించాల్సి ఉంటే ఆ ఫోన్ నెంబర్ లేదా ఈ మెయిల్‌కే పంపుతుంది. ఒకవేళ ఈ పోటీలో పాల్గొనాల్సి ఉంటే ఈ రోజే తుది గడువు. దీనిలో పాల్గొనాల్సిన అభ్యర్థుల వయసు కనీసం 18 సంవత్సరాలు ఉండి తీరాలి.