భోపాల్: రెండు వారాల భయాందోళనల తర్వాత సుమారు 20 మందిపై దాడి చేసి రూ.21,000 రివార్డ్ ఉన్న ‘మోస్ట్ వాంటెడ్’ కోతిని ఎట్టకేలకు అధికారులు నిర్బంధించారు. అధికారులు, రెస్క్యూటీం, స్థానికులు నాలుగు గంటలు పాటు శ్రమించి చివరికి దాని బోనులో పెట్టగలిగారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ పట్టణంలో చోటు చేసుకుంది. ఒక కోతి జనసంచారంలో సంచరిస్తూ ఇళ్ల పైకప్పులు, కిటికీల గుమ్మాలపై కూర్చుని, అకస్మాత్తుగా ప్రజలపైకి దాడి చేయడం ప్రారంభించింది.
ఈ క్రమంలో గత 15 రోజుల్లో 20 మంది స్థానికులు ఆ కోతి దాడి వల్ల గాయాలపాలయ్యారు. వీరిలో 8 మంది పిల్లలు కూడా ఉన్నారు. జనాన్ని బెంబేలెత్తిస్తున్న ఈ కోతిని పట్టుకోవడంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది చేతులెత్తేశారు. ప్రజలపై దాడి చేస్తున్న ఆ కోతిని పట్టుకోవడానికి అనేకసార్లు చేసిన ప్రయత్నించి విఫలం కావడంతో చివరికి స్థానిక అధికారులు.. కోతిని పట్టుకున్నవారికి ₹ 21,000 నగదు బహుమతిని ప్రకటించారు. చివరికి జిల్లా కలెక్టర్ చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది.
ఎలా పట్టుకున్నారంటే!
జిల్లా కలెక్టర్ ప్రమేయంతో ఉజ్జాయినీ అటవీ శాఖకు చెందిన రెస్క్యూ టీమ్ రాజ్‌గఢ్‌కు చేరుకున్నారు. వీరితో పాటు మున్సిపాలిటీ సిబ్బంది, స్థానికులు ఇందుకు సహాయం చేశారు. ఇంతమంది సహకారంతో చివరికి.. ఆ కోతిని పట్టుకోవడానికి 4 గంటల సమయం పట్టుకోగలిగారు. డ్రోన్ సహాయంతో కోతి ఎక్కడ ఉన్నదో అన్నది గుర్తించారు. అలాగే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. దాన్ని పట్టుకుని బోనులో బంధించారు. కోతిని పట్టుకున్నందుకు దానిపై ఉన్న ఉన్న 21,000 నగదు బహుమతిని జంతు రక్షక బృందానికి అందజేస్తామని అధికారులు తెలిపారు.
చదవండి: పురుషుడిగా మారనున్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కుమార్తె.. ఎందుకంటే!
Comments
Please login to add a commentAdd a comment