
సాక్షి, హైదరాబాద్ : అంబేద్కర్‌నగర్‌లో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మనీషా అనే యువతి అదృశ్యమైంది. అదే సమయంలో అదే ఇంటికి సమీపంలో నివసించే మరో వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఈ మేరకు యువతి తండ్రి పులిగిల్ల లక్ష్మయ్య మూడు నెలల క్రితం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి పోలీసులు ఎంత గాలించినా ప్రయోజనంలేకుండా పోయింది. ఈ క్రమంలో తమ ఇంటికి సమీపంలో నివసించే మహేష్ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడని బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేష్ కిడ్నాప్ చేశాడా? వారు ఎక్కడున్నారు?. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అంతేకాకుండా గురువారం రివార్డు ప్రకటించారు. ఆచూకీ తెలిసిన వారు 9490617140, 8555872362 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment