jawahar nagar
-
CRPF స్కూల్లో బాంబు ఉందంటూ కాల్
-
HYD: ‘జవహర్‌నగర్’ కుక్కలదాడి ఘటన.. సీఎం రేవంత్ ఆవేదన
సాక్షి,హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో హైదరాబాద్ జవహర్‌నగర్‌లో రెండేళ్ల బాలుడు విహాన్ మృతి చెందడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని బుధవారం(జులై 17) ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తరచూ ఈ తరహా ఘటనలు జరుగుతున్నందున వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని సీఎం అప్రమత్తం చేశారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పసి కందులపై కుక్కలు దాడులు చేస్తున్న ఘటనల మీద పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీధి కుక్కలకు టీకాలు వేయడంతో పాటు కుక్కల దాడులను నివారించడానికి ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో కుక్కల దాడి చికిత్సకు అవసరమైన అన్ని మందులను అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్యశాఖను సీఎం ఆదేశించారు. జవహర్‌నగర్ మునిసిపల్ ఆఫీసు ముందు స్థానికుల ఆందోళన..కుక్కలదాడిలో రెండేళ్ల బాలుడు విహాన్ మృతి చెందడంపై హైదరాబాద్ జవహర్‌నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆరోపించారు. బుధవారం జవహర్‌నగర్ మునిసిపల్ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. విహాన్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
సీఐఎస్ఎఫ్ మాజీ కానిస్టేబుల్ ఆత్మహత్య
జవహర్‌నగర్: హైదరాబాద్ నగర శివారులోని జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎస్)కు చెందిన ఓ మాజీ కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం .. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం బీబీపేట్ గ్రామానికి చెందిన కుమ్మరి రవీందర్ (30)కు భార్య శిరీష, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. 2017లో సీఐఎస్ఎఫ్లో చేరిన రవీందర్‌ను కొన్ని కారణాలతో 2020లో తొలగించారు. అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పని రవీందర్ రెండేళ్లుగా నిత్యం యూనిఫాం ధరించి హకీంపేట పరిధిలోని సింగాయపల్లిలో ఉంటున్న ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తున్నాడు. మంగళవారం సైతం భార్యకు ఇలాగే చెప్పి వెళ్లిన రవీందర్ కౌకూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అడవికి వెళ్లిన గొర్లకాపరులు ఈ విషయాన్ని జవహర్‌నగర్ పోలీసులకు చెప్పడంతో వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
కిరాణ దుకాణానికి వెళ్తుండగా కిడ్నాప్.. 16 గంటల తర్వాత!
సాక్షి, మేడ్చల్: గుర్తుతెలియని వ్యక్తులు నాలుగేళ్ల చిన్నారిని అపహరించి 16 గంటల తరువాత చెట్ల పొదల్లో వదలివేశారు. తీవ్ర గాయాలతో ఉన్న బాలికను పోలీసులు నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. జవహర్‌నగర్ సీఐ బిక్షపతిరావు తెలిపిన మేరకు.. దమ్మాయిగూడ వెంకటేశ్వరకాలనీకి చెందిన బాలిక ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి కిరాణ దుకాణానికి వెళుతుండగా గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలిస్తున్న క్రమంలో సోమవారం ఉదయం బాలిక ప్రగతినగర్ వాటర్‌ట్యాంక్ వద్ద అపస్మారకస్థితిలో కనిపించింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని బాలికను నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. బాలికపై లైంగిక దాడి చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల ఆదుపులో అనుమానితులు... సోమవారం 4 గంటలకు దమ్మాయిగూడలో కిడ్నాప్‌కు గురైన చిన్నారిని ఆదివారం ఉదయం దాదాపు 9 గంటలకు పొదల్లో చిన్నారిని వదిలిపెట్టారు. దాదాపు 16 గంటల పాటు చిన్నారిని ఎక్కడ ఉంచారు అనేది తేలాల్సి ఉంది. బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు దుండగులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
యువతి అదృశ్యం.. ఆచూకీ తెలిపితే రివార్డు
సాక్షి, హైదరాబాద్ : అంబేద్కర్‌నగర్‌లో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మనీషా అనే యువతి అదృశ్యమైంది. అదే సమయంలో అదే ఇంటికి సమీపంలో నివసించే మరో వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఈ మేరకు యువతి తండ్రి పులిగిల్ల లక్ష్మయ్య మూడు నెలల క్రితం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి పోలీసులు ఎంత గాలించినా ప్రయోజనంలేకుండా పోయింది. ఈ క్రమంలో తమ ఇంటికి సమీపంలో నివసించే మహేష్ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడని బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేష్ కిడ్నాప్ చేశాడా? వారు ఎక్కడున్నారు?. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అంతేకాకుండా గురువారం రివార్డు ప్రకటించారు. ఆచూకీ తెలిసిన వారు 9490617140, 8555872362 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
ట్రైనీ జవాన్ ఆత్మహత్య
జవహర్‌నగర్ : మానసిక ఒత్తిడితో ట్రైనీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్ణాటకలోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీఆర్పీఎఫ్ క్యాంపస్‌లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాములు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... బీదర్‌కు చెందిన రాజప్ప(26) జవహర్‌నగర్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్నాడు. గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి లోనైన రాజప్ప కొన్ని రోజులుగా శిక్షణకు వెళ్లకుండా గదిలోనే ఉన్నాడు. సోమవారం అతను తన గది బాల్కనీలో రాడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్మీ ఉన్నతాధికారి కె.చక్రవర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జవహర్‌నగర్‌లో చోరీ
హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ, వాయుశక్తి నగర్లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. శుక్రవారం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచరాణ చేపడుతున్నారు. బంగారు నగలు, నగదు, ఎల్సీడీ, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ లతో పాటు గృహోపకరణాలను దోచుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపడుతున్నారు.