
జవహర్‌నగర్ : మానసిక ఒత్తిడితో ట్రైనీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్ణాటకలోని జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపస్‌లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాములు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... బీదర్‌కు చెందిన రాజప్ప(26) జవహర్‌నగర్‌లోని సీఆర్‌పీఎఫ్ క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్నాడు. గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి లోనైన రాజప్ప కొన్ని రోజులుగా శిక్షణకు వెళ్లకుండా గదిలోనే ఉన్నాడు. సోమవారం అతను తన గది బాల్కనీలో రాడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్మీ ఉన్నతాధికారి కె.చక్రవర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.