
సాక్షి, హైదరాబాద్: ఓ వృద్ధురాలిని చంపి బంగారు నగలతో ఉడాయించిన ఓ నిందితుడు ఏడాదిన్నరగా నగర పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఆ దొంగ సమాచారం అందిస్తే 50 వేల నజరాన ఇస్తామని రాచకొండ కమిషనర్ పోలీసులు శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు తమిళనాడులోని తుత్తుకూడి గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, డ్రైవింగ్ చేస్తూ భార్యతో మెడ్చల్‌లోని హౌజింగ్ బోర్డు కాలనీలో నివసించేవాడు.
గతేడాది మార్చిలో మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్‌పేట,వెంకటాద్రి నివాస్‌లో ఒంటిరిగా నివసిస్తున్న నాగమణి అనే వృద్ధురాలిని హతమార్చి ఆమె నగలతో ఉడాయించాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా నిందితుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇప్పటికే అతని భార్యను అదుపులోకి తీసుకున్న మీర్‌పేట్ పోలీసులు అతని ఆచూకి కనుగొనడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో పోలీసులు నిందితుని సమాచారం తెలియజేస్తే రూ.50 వేల రివార్డు అందిస్తామని, సమాచారం అందించిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment