హెడ్‌ కానిస్టేబుల్‌కు రివార్డు | - | Sakshi
Sakshi News home page

హెడ్‌ కానిస్టేబుల్‌కు రివార్డు

Published Sun, Apr 30 2023 7:50 AM | Last Updated on Sun, Apr 30 2023 8:01 AM

పళనిముత్తుకు రివార్డు అందజేస్తున్నకళ్లకురిచ్చి ఎస్పీ మోహన్‌రాజ్‌  - Sakshi

పళనిముత్తుకు రివార్డు అందజేస్తున్నకళ్లకురిచ్చి ఎస్పీ మోహన్‌రాజ్‌

కొరుక్కుపేట: శంకరాపురం సమీపంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణను పరిష్కరించిన హెడ్‌ కానిస్టేబుల్‌ పళనిముత్తుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. కళ్లకురిచ్చి జిల్లా, శంకరాపురం సమీపంలోని రౌతనల్లూర్‌ గ్రామం వద్ద మారియమ్మన్‌ ఆలయానికి కందులు పోసే విషయంలో పంచాయతీ కౌన్సిల్‌ చైర్మన్‌ భర్త కదిరవన్‌న, అదే గ్రామానికి చెందిన మాయవన్‌ మధ్య వాగ్వాదం జరిగింది. కదిరవన్‌ దాడిలో మాయవన్‌ తీవ్రంగా గాయపడడంతో ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ ఘర్షణకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు. బందోబస్తులో ఉన్న వడపొన్‌న్‌పరప్పి హెడ్‌ కానిస్టేబుల్‌ పళనిముత్తు ఇరువర్గాలను అదుపు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ ఆయనకు రివార్డు అందించి అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement