
రికార్డ్ స్థాయిలో ఆపిల్ అమ్మకాలు
కశ్మీర్: సుదీర్ఘకాలంగా కర్ఫూ నీడలో మగ్గిపోతున్న జమ్ము కశ్మీర్ లో ఆపిల్ అమ్మకాలు రికార్డ్ స్థాయిలో నమోదయ్యాయట. ఆపిల్ పళ్లకు పెట్టింది పేరైన కశ్మీర్ ఈ ఏడాది గణనీయమైన ఉత్పత్తిని సాధించింది. గత కొన్ని సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరం అధిక ఉత్పత్తిని, అమ్మకాలను సాధించామని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పూంచ్ లో భారీ ఎత్తున ఆపిల్ విక్రయాలు జరిపినట్టు చెప్పారు. కశ్మీర్ లోయలో తీవ్రమైన అశాంతి ఉన్నప్పటికీ తమ ఆపిల్ పళ్లకు భలే డిమాండ్ ఉందని సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా కిలోకు రూ.100 ఉండే కశ్మీరీ ఆపిల్ ధర ఇప్పుడు రూ. 20-30 పలుకుతోందని తెలిపారు.