పాక్ కాల్పులు : ఆరుకి చేరిన మృతులు | dies in Pak firing in Jammu and Kashmir's Poonch, 6th civilian killed since yesterday | Sakshi
Sakshi News home page

పాక్ కాల్పులు : ఆరుకి చేరిన మృతులు

Published Sun, Aug 16 2015 9:17 AM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM

dies in Pak firing in Jammu and Kashmir's Poonch, 6th civilian killed since yesterday

శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లా సరిహద్దుల్లో పాక్ బలగాలు శనివారం జరిపిన కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య ఆరుకి చేరింది. పాక్ బలగాల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. దాంతో మృతుల సంఖ్య ఆరుగురకి చేరింది.

శనివారం పాక్ బలగాలు పూంచ్ సరిహద్దుల్లో కాల్పులు జరిపింది...  ఈ ఘటనలో ముగ్గురు మరణించగా... నలుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. క్షతగాత్రులను సైనిక అధికారులు ఆసుపత్రికి తరలించారు. పాక్ బలగాలు సరిహద్దు వద్ద భారత్ బలగాలనే లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన తెంపరితనాన్ని చాటుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement