Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India squad for England Tests out, Gill to captain1
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మన్‌ గిల్‌.. అధికారిక ప్రకటన

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. రోహిత్ శర్మ స్దానాన్ని గిల్ భర్తీ చేయనున్నాడు. అదేవిధంగా శుబ్‌మన్ గిల్ డిప్యూటీగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను నియమించారు. ఇక ఐపీఎల్‌లో దుమ్ములేపుతున్న యువ సంచ‌ల‌నం సాయిసుద‌ర్శ‌న్‌, అర్ష్‌దీప్ సింగ్‌ల‌కు తొలిసారి భార‌త టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కింది. మ‌రోవైపు దేశ‌వాళీ క్రికెట్‌లో ప‌రుగులు వ‌రద పారిస్తున్న మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్‌ కరుణ్ నాయ‌ర్‌కు సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు. దాదాపు తొమ్మిదేళ్ల త‌ర్వాత భార‌త జ‌ట్టులోకి నాయ‌ర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. క‌రుణ్ నాయ‌ర్‌తో పాటు శార్ధూల్ ఠాకూర్ కూడా తిరిగి టీమిండియాలోకి పున‌రాగ‌మ‌నం చేశాడు. ఈ జ‌ట్టులో మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డం అంద‌రి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.అదేవిధంగా ఆసీస్ టూర్‌లో భాగ‌మైన హ‌ర్షిత్ రాణా, స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు సెల‌క్ట‌ర్లు ఈసారి మొండి చేయి చూపించారు. కాగా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆతిథ్య జ‌ట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్‌ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వ‌ర‌న్‌, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్Shubman Gill-led #TeamIndia are READY for an action-packed Test series 💪A look at the squad for India Men’s Tour of England 🙌#ENGvIND | @ShubmanGill pic.twitter.com/y2cnQoWIpq— BCCI (@BCCI) May 24, 2025

YS Jagan Reacts On YSR District Road Accident2
వైఎస్సార్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.వైఎస్సార్‌ జిల్లాలో రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. లారీ-కారు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి’ అని అన్నారు.

KSR Comments On Chandrababu And Yellow Media3
పచ్చ మీడియా పరిస్థితి.. మింగలేక.. కక్కలేక!

ఆంధ్రప్రదేశ్‌లో పచ్చమీడియా ఎప్పుడో దిగజారి పోయింది!. ఆ పతనం గురించి ఈరోజు ఇంకోసారి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విలేకరుల సమావేశం పెట్టి.. 2014-19 మధ్య, ఏడాదిగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కుంభకోణాలను, మద్యం దందాను ఆధారాలతోపాటు ఎండగడితే.. కూటమి ప్రభుత్వం కానీ.. దాన్ని మోస్తున్న పచ్చమీడియా కానీ సరైన సమాధానమే ఇవ్వలేకపోయింది!. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా ఏదో జరిగిపోయిందంటూ హడావుడి మాత్రం మళ్లీ తలకెత్తుకుంది!. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్‌ విలేకరుల సమావేశంలో చేసిన ఆరోపణలకు ఈ మీడియా నేరుగా సమాధానం ఇవ్వలేక చతికిలపడింది. మరీ ముఖ్యంగా మద్యం దందా గురించి!.తాజాగా ఈనాడులో వచ్చిన కథనం చూస్తే, ఏపీ సీఐడీ వద్ద జగన్‌ హయాంలో జరిగినట్లు చెబుతున్న స్కామ్‌లకు సంబంధించి రుజువులేవీ లేనట్టు ఇట్టే అర్థమైపోతుంది. ఆ విషయం నేరుగా చెప్పలేక ‘వేల కోట్లు దోచేసి, ఆధారాలు చెరిపేసి..’ అంటూ ఓ అడ్డగోలు కథ చెప్పుకొచ్చింది ఆ పత్రిక!. మద్యం కుంభకోణం ఆనవాళ్లు కూడా దొరక్కుండా కుట్ర పన్నారని, ఫోరెన్సిక్ రికవరికి కూడా వీల్లేకుండా చెరిపి వేశారని ఈ కథనం సారాంశం. వైఎస్సార్‌సీపీ మద్యం ముఠా 375 పేజీలు, రికార్డులు, డాక్యుమెంట్లకు సమానమైన డేటాను నాశనం చేసిందని, ఫలితంగా దర్యాప్తునకు తీవ్ర అవరోధాలు ఎదురైనా సిట్‌ వాటిని అధిగమించిందని చెప్పుకొచ్చారు. ఏమన్నా అర్థం ఉందా! అసలు కేసు ఏమిటి? డేటా ఎందుకు ఉంటుంది?. ఉత్పత్తిదారుల నుంచి సరఫరా అయ్యే మద్యానికి సంబంధించిన డేటా కంప్యూటర్లలో నమోదవుతాయి. ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. కానీ కూటమి పెద్దలకు అది సరిపోలేదట. తప్పుడు కేసులతో అరెస్ట్‌ చేసిన వారి వద్ద కూడా సమాచారం ఏదీ దొరికి ఉండదు. దీంతో ఈ కొత్త కహానిని సృష్టించింది కూటమి!.రికార్డులన్నీ లభ్యమై ఉంటే కుంభకోణం మూలాలు మరిన్ని వెలుగులోకి వచ్చేవంటోంది ఆ పత్రిక. ఏతావాతా అర్థమయ్యేది ఏంటి? సీఐడీ కేసు ఓ కట్టుకథ అని! ఎల్లో మీడియా సాయంతో జగన్‌, వైఎస్సార్‌సీపీలపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం అని!. అసలు ఈ మద్యం కుంభకోణం కేసు ఎలా మొదలైంది? ఎవరో దారిన పోయే వ్యక్తి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే.. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వెంటనే స్పందించి విచారణకు ఆదేశించడం.. ఏసీబీ ఆ వెంటనే రికార్డు సమయంలో ఏదో కనిపెట్టినట్లు నివేదిక ఇవ్వడం చకచక జరిగిపోయాయి. ఆ వెంటనే సీఐడీ రంగంలోకి దిగింది. ఎవరో ఒకరిని అరెస్ట్‌ చేయడం.. వారితో బలవంతంగా ఏదో చెప్పించడం.. దాని ఆధారంగా మరికొందరి అరెస్ట్‌.. ఇలా సాగిపోయింది కేసు విచారణ. ఇక ఎల్లో మీడియా పాత్ర మొదలైంది కూడా ఇక్కడే. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డి, మరో విశ్రాంత అధికారి కృష్ణమోహన్‌ రెడ్డిలను అరెస్టు తరువాత ఇక జగన్ అరెస్టే మిగిలిందంటూ ఊదరగొట్టింది.మద్యం కుంభకోణం లాభాలు విదేశాలకు తరలిపోయాయని ఒకసారి, బంగారం కొన్నారని రెండో రోజు.. ఆస్తులు కొన్నారని ఇంకోసారి, సంచుల్లో నగదు తరలించారని ఆ మరుసటి రోజు.. ఇలా రోజుకో రకమైన కథనాలు రాసుకుంటూ.. ఆఖరకు ఆధారాల్లేకుండా చేశారని ఏడుస్తోంది ఈనాడు! అసలు కుంభకోణమే లేనప్పుడు.. ఆధారాలెక్కడి నుంచి వస్తాయి? జగన్‌ హయాంలో ఏదో జరిగిందన్న అనుమానం ప్రజల్లో నాటడమే ఎల్లో మీడియా లక్ష్యమని దీంతో మరోసారి స్పష్టమైపోయింది. లేదంటే.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిన చంద్రబాబు వైఫల్యాన్ని, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు పచ్చ పత్రిక ఈ కుట్రకు తెరతీసి ఉండాలి. పచ్చ మీడియా పోకడలను మొదటి నుంచి నిశితంగా పరిశీలించడమే కాకుండా.. ఎప్పటికప్పుడు వాటిని ఆధారాలతోసహా ఎండగడుతూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మద్యం కుంభకోణం లోతుపాతులను, అసలు కర్తలెవరు అన్నది రుజువులతో సహా ప్రజలకు వివరించారు. ఈ కేసులోనే చంద్రబాబు బెయిల్‌పై ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 2014-15లో కేబినెట్‌ ఆమోదం, ఆర్ధిక శాఖ అంగీకారం లేకుండా, మద్యంపై ఉన్న ప్రివిలేజ్ ఫీజ్ చంద్రబాబు రద్దు చేసిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. ఫలితంగా అప్పట్లో మద్యం విక్రయాలు పెరిగినా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గిందని, ఇందులో అవినీతి ఉన్న సంగతిపై కేసు వచ్చిందని ఆయన వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే క్రమంలో మొత్తం టీడీపీ నేతలే వాటిని కైవసం చేసుకున్నారని, ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతున్నారని, గతంలో ఎన్నడూ లేని నాసిరకం బ్రాండ్లు అమ్ముతున్నారని జగన్ సోదాహరణంగా వివరించారు. ఇక అనధికార పర్మిట్ రూము వేల కొద్ది బెల్ట్‌షాపులు, ఎమ్మార్పీకి మించి వసూళ్లు జరుగుతున్నాయని, ఇది అసలు మద్యం స్కామ్ అని జగన్ స్పష్టం చేశారు. తాము చేసిన కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు తన హయాంలో ఏదో జరిగిపోయిందని చంద్రబాబు అండ్‌ కో ఓ భేతాళ కథ సృష్టించారని తెలిపారు.జగన్‌ ఆరోపణలపై ప్రభుత్వ పరంగా ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదు. జగన్‌ను విమర్శించేందుకు కొందరు టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టినా నిర్దిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారు. షాపులు ప్రభుత్వం నడిపితే స్కాం జరుగుతుందా? ప్రైవేటు వారికి అప్పగిస్తేనా? అన్న జగన్‌ ప్రశ్నకు నిశ్శబ్ధమే సమాధానం అవుతోంది. మద్యం రేట్లు పెంచి, డిమాండ్ తగ్గిస్తే డిస్టిలరీలు ముడుపులు ఇస్తాయా? లేక మద్యం రేట్లు తగ్గించి డిమాండ్ పెంచితే ముడుపులు వస్తాయా? అన్న ప్రశ్నకు కూడా జవాబు లేదు. తాను కానీ, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కానీ ఎక్కడైనా ఫైళ్లపై సంతకాలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయా అని కూడా జగన్‌ నిలదీశారు. ఆ అధికారులకు ఎక్సైజ్‌ శాఖతో సంబంధమే లేనప్పుడు వారెలా బాధ్యులవుతారని ప్రశ్నించారు.టీడీపీ హయాంలో జరిగిన మద్యం స్కాం గురించి చంద్రబాబు, టీడీపీ నేతలు వారికి మద్దతిచ్చే ఎల్లోమీడియా ఎప్పుడూ వివరణ ఇవ్వలేదు. ఎదురుదాడి ద్వారానే తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి భిన్నంగా జగన్‌ చంద్రబాబు టైమ్‌లో కుంభకోణం ఎలా మొదలైంది? తన హయాంలో ఆ అవకాశం ఎందుకు లేకుండా పోయిందో చాలా స్పష్టంగా వివరించారు. జగన్‌ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం చిన్న ఆధారం దొరికినా నానా రచ్చ చేసేదన్నది నిర్వివాద అంశం. కానీ వీసమెత్తు ఆధారమూ లేకపోవడంతో కొంతమందిని నిందితులుగా చేసి, బలవంతంగా వారి నుంచి వాంగ్మూలాలను తీసుకుని ఎలాగొలా జగన్‌ను కూడా ఇరికించాలని చంద్రబాబు సర్కార్ వ్యూహం పన్నినట్లు తేలుతోంది. కాకపోతే నిందితుల వాంగ్మూలాలు కేసుకు సాక్ష్యాలు కావని సుప్రీంకోర్టు చెప్పడంతో వీరి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్ల అయ్యింది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Shah Rukh Khan As Brand Ambassador of Candere4
ఒకే ఇంట్లో షెహన్‌షా, బాద్‌షా: కందేరే బ్రాండ్ అంబాసిడర్‌గా షారుక్ ఖాన్

ముంబయి: సోషల్ మీడియాలో జరిగిన చర్చల అనంతంరం చివరకు అధికారిక ప్రకటన వెలువడింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ 'షారుక్ ఖాన్‌'ను కందేరే ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ ప్రకటన కేవలం ఊహాగానాలకు ముగింపు మాత్రమే కాదు. భారత ఆభరణాల పరిశ్రమలోను, బ్రాండ్ కథనాల ప్రపంచంలోను ఒక కీలక మలుపుగా నిలుస్తోంది.ఈ ప్రచార యాత్ర ప్రారంభమైంది ఒక స్టైలిష్ టీజర్‌తో. అందులో ఖాన్ మెరిసే ఆభరణాలతో ఆకర్షణీయంగా కనిపించడంతో, అభిమానులు ఇది ఆయన సొంత బ్రాండ్ అని భావించారు. షారుక్ ఇప్పటికే అనేక వ్యాపారాల్లో పాల్గొన్న నేపథ్యంలో.. కంపెనీలో ఆయనకు షేర్స్ ఉంటాయనే ఊహలు వెలుగులోకి వచ్చాయి.దీనిపై కందేరే సంస్థ తక్షణమే స్పందిస్తూ.. షారుక్ ఖాన్ కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని, కంపెనీలో ఆయనకు ఎలాంటి వాటా లేదని స్పష్టంగా పేర్కొంది. ఇది ప్రచార సంబంధిత భాగస్వామ్యమే అయినప్పటికీ, దీని వెనుక ఉన్న సాంస్కృతిక, వాణిజ్య పరమైన ప్రభావం భారీగానే ఉంది.ఈ భాగస్వామ్యం ద్వారా కల్యాణ్ జ్యూవెలర్స్ గ్రూప్.. భారత సినిమా రంగంలోని ఇద్దరు అగ్రనటులను ఒకే బ్రాండ్ గూటిలో చేర్చింది. ఒకవైపు సంప్రదాయానికి ప్రతీక అయిన అమితాబ్ బచ్చన్ కల్యాణ్ బ్రాండ్‌కు, మరోవైపు ఆధునికత, డిజైన్‌పై దృష్టి పెట్టిన కందేరే బ్రాండ్‌కు షారుక్ ఖాన్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు.కందేరే ఓమ్ని-చానెల్ బ్రాండ్‌గా 75కి పైగా రిటైల్ అవుట్‌లెట్లు కలిగి ఉంది. ఇది వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే, రోజువారీ ఉపయోగానికి సరిపోయే, ఆధునిక శైలికి అనుగుణంగా రూపొందించిన లైఫ్‌స్టైల్ ఆభరణాలను అందిస్తుంది. షారుక్ ఖాన్ కొత్త ప్రచారం.. కందేరే బ్రాండ్ సంప్రదాయం.. ఆధునికత మధ్య ఉన్న అందమైన సమతౌల్యానికి ప్రతీకగా మారుతోంది. సినిమా గ్లామర్, మిల్లీనియల్స్, జెన్ జెడ్ తరాల అభిరుచులతో మిళితంగా నిలుస్తోంది.మార్కెటింగ్ పరంగా చూస్తే, ఈ డ్యూయల్ సెలబ్రిటీ వ్యూహం అనేది తెలివిగా రూపొందించిన ఒక తరాల వారసత్వ కథనంగా నిలుస్తోంది. బ్రాండ్ విలువను క్షీణింపచేయకుండా, యువత నుంచి వృద్ధుల దాకా అందరినీ కలిపే విధంగా. షెహన్‌షా (బచ్చన్) మరియు బాద్‌షా (ఖాన్) ను ఒకే సంస్థ గూటిలో చేర్చిన కల్యాణ్ హౌస్, సంప్రదాయానికి గౌరవం ఇస్తూనే మార్పును ఆలింగనం చేసే ఆభరణాల సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇది శాశ్వత సంప్రదాయాల నుంచి ఆధునిక మెరుపుల దాకా, ఇప్పుడు తరాలను ఒకచోట చేర్చే వారసత్వాన్ని సృష్టిస్తోంది.

BRS KTR reacts On Kavitha Letter5
కవితకు కేటీఆర్‌ పరోక్షంగా వార్నింగ్‌..

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఇదే సమయంలో పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది అంటూ కవితకు కేటీఆర్‌ పరోక్షంగా వార్నింగ్‌ ఇచ్చారు.మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కవిత లేఖపై స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్‌.. మా పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. మా పార్టీలో ప్రజాస్వామిక స్పూర్తి ఉంది. పార్టీలో ఎవరైనా సూచనలు చేయవచ్చు.. ఎవరైనా లేఖలు రాయవచ్చు. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు. పార్టీలో అందరం కార్యకర్తలమే.. అందరూ సమానమే. ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతుంటే దేవుడు, దెయ్యం ఎందుకు? అని ప్రశ్నించారు.

Bollywood Actor Mukul Dev Dies At 546
బాలీవుడ్‌లో విషాదం.. రవితేజ ‘కృష్ణ’ విలన్‌ ఇక లేరు

బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ముకుల్‌ దేవ్‌(54) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.సీరియల్‌ నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ముకుల్‌ దేవ్‌ (Mukul Dev) బాలీవుడ్‌ మూవీ ‘దస్తక్‌’తో వెండితెరకి పరిచయం అయ్యాడు. హిందీతో పాటు తెలుగు, పంజాబీ, కన్న చిత్రాల్లోనూ నటించాడు. ముకుల్‌ దేవ్‌కి టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కృష్ణ, ఏక్ నిరంజన్, కేడీ, అదుర్స్, నిప్పు, భాయ్‌ తదితర సినిమాల్లో నటించాడు. కృష్ణ సినిమాలో పోషించిన విలన్‌ పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2022లో విడుదలైన ‘అంత్‌ ది ఎండ్‌’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు. ‘సింహాద్రి’, ‘సీతయ్య’, ‘అతడు’ చిత్రాల్లో నటించిన రాహుల్‌ దేవ్‌ సోదరుడే ముకుల్‌. తల్లిదండ్రుల మరణంతో ముకుల్ కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నారు. ఈ క్రమంలో అనారోగ్యం పాలవ్వడంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.చ‌ద‌వండి: క‌న్న‌ప్ప టీమ్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మంచు మ‌నోజ్‌

Aadhaar free update deadline on June 14 Here is how to update Aadhaar details online7
ఆధార్‌ అప్‌డేట్‌ గడువు జూన్‌ 14 వరకే..

దేశ ప్రజలకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్‌ ఆధార్‌. జారీ చేసినప్పటి నుంచి వీటిని ఇంత వరకూ అప్‌డేట్‌ చేసుకోనివారు వెంటనే చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకునేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ)అవకాశం కల్పించింది. ఇందుకోసం గతేడాది గడువును విధించింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ ప్రస్తుతానికి జూన్ 14 వరకు గడువు విధించారు. ఆ తర్వాత రూ .50 రుసుమును చెల్లించి ఆధార్‌ కేంద్రాల వద్ద అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అండ్ అప్‌డేట్ రెగ్యులేషన్స్, 2016 ప్రకారం.. కార్డుదారులు తమకు కార్డు జారీ చేసినప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వారి గుర్తింపు రుజువు (పీఓఐ), చిరునామా రుజువు (పీఓఏ) అప్‌డేట్‌ చేసుకోవాలి. రెగ్యులర్ అప్‌డేట్లు ఆధార్ లోని సమాచారం, ప్రస్తుత డాక్యుమెంటేషన్‌కు అనుగుణంగా ఉండేలా చూస్తాయి.ఆధార్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్‌ చేసుకోకపోతే ప్రభుత్వ సబ్సిడీలను పొందేటప్పుడు, బ్యాంకు ఖాతాలను తెరిచేటప్పుడు లేదా ఇతర అవసరమైన కేవైసీ ప్రక్రియలను పూర్తి చేసేటప్పుడు సమస్యలకు దారితీయవచ్చు. అంతేకాకుండా ఆధార్ సమాచారాన్ని క్రమం తప్పకుండా అప్‌డేట్‌ చేసుకోవడం వల్ల డెమోగ్రాఫిక్ డేటాబేస్‌లో ఖచ్చితత్వాన్ని నిర్వహించడానికి అధికారులకు వీలవుతుంది. తద్వారా దుర్వినియోగాలు, మోసాలు నివారించడంతోపాటు ప్రజా సేవల్లో జాప్యాలు, తిరస్కరణలను తగ్గించడానికి ఆస్కారం కలుగుతుంది.ఆన్‌లైన్‌లో ఏమేమి అప్‌డేట్ చేయవచ్చు?ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్ అప్‌డేట్‌ చేసుకునే సౌకర్యాన్ని యూఐడీఏఐ అందిస్తున్నప్పటికీ, ఆధార్‌లోని కొన్ని రకాల వివరాలను అప్‌డేట్‌ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉంది. యూఐడీఏఐ ప్రస్తుతం మై ఆధార్ పోర్టల్ ద్వారా నిర్దిష్ట డెమోగ్రాఫిక్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్డేట్ చేయడానికి అనుమతిస్తోంది. అవి ఏమిటంటే..🔹పేరు (చిన్న మార్పులు చేసుకోవచ్చు)🔹పుట్టిన తేదీ (కొన్ని పరిమితులున్నాయి)🔹చిరునామా🔹జెండర్‌🔹భాష ప్రాధాన్యతలుబయోమెట్రిక్ సమాచారం మారదుఆన్‌లైన్‌లో ఆధార్‌ బయోమెట్రిక్ సమాచారం అప్‌డేట్‌ చేసేందుకు వీలులేదు. ఫోటో, వేలిముద్రలు, ఐరిస్‌ (కనుపాప) స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయాలనుకుంటే, భౌతికంగా ఆధార్ నమోదు కేంద్రంలో మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే బయోమెట్రిక్ వివరాలను ధ్రువీకరించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు అవసరమైన పరికరాలు కేంద్రాల వద్ద మాత్రమే ఉన్నాయి.ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ ఇలా..👉అధికారిక పోర్టల్ https://myaadhaar.uidai.gov.in ను సందర్శించండి.👉"లాగిన్" బటన్ పై క్లిక్ చేసి మీ 12 అంకెల ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.👉రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) వస్తుంది. మీ ప్రొఫైల్ యాక్సెస్ చేయడానికి దానిని నమోదు చేయండి.👉లాగిన్ అయిన తర్వాత పేజీ పై కుడివైపున ఉన్న 'డాక్యుమెంట్ అప్‌డేట్'పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీ ప్రస్తుత గుర్తింపు రుజువు, చిరునామా రుజువును ధ్రువీకరించి అప్‌డేట్ చేస్తారు.👉డ్రాప్‌డౌన్ మెనూ నుంచి తగిన డాక్యుమెంట్ రకాలను ఎంచుకుని స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి. ఫైళ్లు JPEG, PNG లేదా PDF ఫార్మాట్ లో, 2MB కంటే తక్కువ పరిమాణంలో ఉండేలా చూసుకోండి.👉వివరాలన్నీ సరిచూసుకుని డాక్యుమెంట్ లను సబ్‌మిట్ చేయండి. తర్వాత మీకొక సర్వీస్ రిక్వెస్ట్ నెంబరు (SRN) వస్తుంది. దీనితో అప్‌డేట్‌ స్థితిని ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది.

IMD Says Southwest Monsoon Set Reached Kerala8
చల్లని కబురు.. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

తిరువనంతపురం: దేశంలో రైతులకు శుభవార్త. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణం కన్నా 8 రోజులు ముందుగానే ఈ రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రుతు పవనాల ఎఫెక్ట్‌తో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, నైరుతి రుతుపవనాలు రాకతో ఇప్పటికే కేరళలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల కారణంగా భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో, మున్సిపల్‌ శాఖ సిబ్బంది రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగిస్తున్నారు. Southwest Monsoon has set in over Kerala today, the 24th May, 2025, against the normal date of 1st June. Thus, southwest monsoon has set in over Kerala 8 days before the normal date: IMD pic.twitter.com/sstbHe0TnM— ANI (@ANI) May 24, 2025Heavy Rains in Trivendrum #keralarains pic.twitter.com/bVo8o4hFYe— MasRainman (@MasRainman) May 24, 2025மழை அழகு.மழைக்கால தொடக்கத்தில் கேரளாவில் பயணிப்பதும் அழகோ அழகு.இடைவிடாத மழை.#KeralaRains#Kerala#Keralam#KeralaNews#keralatourism#മനോഹരമായ_മഴ pic.twitter.com/GCLRG1oGlS— இரா.கந்தசாமி - R.Kandasamy (@mrkandasamy) May 24, 2025Welcome South West Monsoon 2025!#Trivandrum Airport 96mmTrivandrum city 87mm#Mangalore 84mmHonnavar 58mmKarwar 49mmKannur 54mmKozhikode 63mmKottayam 41mm#Kochi 76mm#Monsoon #KeralaRains #KarnatakaRains pic.twitter.com/VeQDWN5jOf— Natarajan Ganesan (@natarajan88) May 24, 2025

vallabhaneni Vamsi Suffers Severe Illness In Kankipadu9
వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. కంకిపాడు పీఎస్‌ నుంచి తరలింపు..

సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థత గురయ్యారు. వంశీకి వాంతులు కావడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. నిలబడలేక, కూర్చోలేక అవస్థలు పడుతున్నారు. దీంతో, వంశీని కాసేపటి క్రితమే జీజీహెచ్‌కు తరలించారు. అనారోగ్యంతో​ బాధపడుతున్నప్పటికీ విచారణ పేరుతో పోలీసులు వంశీని కంకిపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో వంశీ ఆరోగ్య విషయమై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా.. విచారణ నిమిత్తం కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న వంశీ శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పోలీసులు ఆయన్ను వెంటనే కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసు­కున్న వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, పలువురు నేతలు ఆస్పత్రి వద్దకు వచ్చారు. అనంతరం, పేర్ని నాని వైద్యులతో మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. వంశీ సతీమణి పంకజశ్రీకి ధైర్యం చెప్పారు. ఇక, వంశీకి వైద్యం నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Meet man who once worked as auto driver now Rs 800 crore business10
ఆటో డ్రైవర్‌గా మొదలై.. రూ 800 కోట్ల కంపెనీ, వరల్డ్‌ నెం.1 లగ్జరీ కారు

కలలను సాకారం చేసుకోవాలంటే..కలలు కంటూ కూర్చుంటే సరిపోదు.. నాకేదీ కలసి రావడం లేదంటూ నిట్టూరిస్తే కుదరదు. కష్టాలను, కన్నీటి సుడిగుండాలను దాటాలి. అడ్డంకులెన్నెదురైనా ఛేదించాలి, అవరోధాలను అధిగమించాలి, ఆలోచనలకు పదునుపెట్టాలి. అదే విజయానికి బాటలు వేస్తోంది. ఆటో డ్రైవర్ నుండి రూ.800 కోట్ల వ్యాపారవేత్త వరకూ ఎదిగిన సత్యశంకర్‌ స్ఫూర్తిదాయక కథ గురించి తెలిస్తే.. ఎలాంటి వారికైనా ఉత్సాహ రాకమానదు.దృఢ సంకల్పం, అంకితభావం ఉంటే అత్యంత అసాధ్యమైన కలలను కూడా నిజం చేసుకోవచ్చు అనడానికి ఒక చక్కని ఉదాహరణ.కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్లారేలో ఒక పేద గ్రామ పూజారి నలుగురు కుమారులలో మూడవవాడు సత్య శంకర్‌. పేదరికం కారణంగా 12వ తరగతి తర్వాత చదువు మానేయాల్సి వచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్ చేతిలో ఉండటంతో, కేంద్ర ప్రభుత్వ స్వయం ఉపాధి పథకం కింద రుణం తీసుకుని ఆటోరిక్షా కొన్నాడు. ఆటో-రిక్షా డ్రైవర్‌గా టెక్‌ సిటీ ఉత్సాహం సత్యాన్ని కూడా ఆవిరించిందో ఏమో గానీ వ్యాపారవేత్తగా మారాలన్న ఆలోచనకు మరింత పదును పెరిగింది. 1980లలో ఆటో-రిక్షా డ్రైవర్‌గా బెంగళూరులోని ట్రాఫిక్‌ సాగరంలో మునిగి తేలుతూ వీధుల్లో పయనించేవాడు. కష్టపడి ఆటో అప్పు తీర్చేశాడు. దానిని అమ్మి అంబాసిడర్ కారు కొన్నాడు. ఈ ఉత్సాహంతో జీవితాన్ని మెరుగు పరచు కోవాలనే కల సాకారం వైపు అడుగులు వేశాడు. తరువాత కొన్ని రోజులు ఆటోమోటివ్ గ్యారేజ్ వ్యాపారంలోకి ప్రవేశించి టైర్లు అమ్మడం ప్రారంభించాడు. ఆటోమొబైల్ దుకాణాన్ని నడుపు తున్నప్పుడు అతను ఫైనాన్స్ నిర్వహణలోసూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నాడు. కస్టమర్లు విడిభాగాలను అప్పుకింద కొనుగోలు చేసి, తరువాత వాయిదాలలో చెల్లించేవారు. అతను ఆ అనుభవాన్ని ఉపయోగించి ఆటోమొబైల్ ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించాడు. 1994లో, అతను ప్రవీణ్ క్యాపిటల్‌ను ప్రారంభించి, తక్కువ వడ్డీకి డబ్బు అప్పుగా ఇచ్చాడు. ప్రవీణ్ క్యాపిటల్‌ను ప్రత్యేకంగా నిలిపిన విషయం ఏమిటంటే, అది కొత్త వాహనాలను మాత్రమే కాకుండా, సెకండ్ హ్యాండ్ వాహనాలను కొనుగోలు చేయడానికి రుణాలు అందించింది.ఆ తరువాత మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. 2000లో పుత్తూరు సమీపంలోని నరిమోగేరులో ‘బిందు’ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీని ప్రారంభించాడు. గ్రామీణులకు ఉద్యాగాల కల్పన, శుభ్రమైన నీరు అందించడమే లక్ష్యం. రెండేళ్లకు శంకర్ ఒక ప్రత్యేకమైన రుచితో కార్బోనేటేడ్ డ్రింక్‌తో వ్యాపారంలోకి దిగాడు. స్నేహితులతో ఉత్తర భారతదేశ పర్యటనలో అతను చూసిన సోడా అమ్మే దుకాణమే దీనికి నాంది. జీరా, ఉప్పు మిశ్రమంతో సోడా కలిపితే మంచి ప్రొడక్ట్‌ అవుతుంది, లాభాలొస్తాయని ఊహించాడు. అంతే 2002లో తన సొంత కంపెనీ ఎస్‌జీ కార్పొరేట్స్‌ను స్థాపించాడు. తొలుత “బిందు జీర మసాలా సోడా”ను మార్కెట్లోకి వదిలాడు. కాలం గడిచే కొద్దీ, బిందు జీర మసాలా సోడా ప్రజాదరణ పొందింది. ఇలా ఎస్‌జీ కంపెనీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ , స్నాక్స్ 55 ఉత్పత్తులను విక్రయిస్తుంది. బెంగళూరు దాటి కర్ణాటక అంతటా, అంతకు మించి వినియోగదారులను ఆకర్షించింది. వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందింది. ఇక వెనుదిరిగి చూసింది లేదు. దాదాపు 20 ఏళ్ల కష్టం సత్యానికి గొప్ప సక్సెస్‌ను అందించింది.ఇదీ చదవండి: భగవద్గీత శ్లోకం, బ్లాక్‌ వెల్వెట్‌ గౌను : ఐశ్వర్య సెకండ్‌ లుక్‌పై ప్రశంసలు ఈ విజయం అంత తేలిగ్గా రాలేదు. సత్యశంకర్ కె స్థాపించిన ఎస్‌జీ గ్రూప్‌ బహుళ రంగాల వ్యాపారంగా ఎదిగింది. ఆహారం, పానీయాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, ఆటో ఫైనాన్స్, సేంద్రీయ వ్యవసాయం,పండ్ల ప్రాసెసింగ్‌ లాంటి రంగాల్లో విలువైన సేవలు అందించింది. ఫలితంగా ఎస్‌జీ గ్రూపు వార్షిక టర్నోవర్ దాదాపు రూ. 800 కోట్లు. ఇదీ చదవండి : కాన్స్‌లో వివాదాల బ్యూటీ ఊర్వశి : ఈ సారి రూ. 5లక్షల డైమండ్‌ బ్యాగ్‌తోఅంతేనా ఆటో రిక్షాతో ప్రారంభమైన సత్య జీవితం ఇప్పుడు రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIIIదాకా చేరింది. దీని ధర రూ. 11 కోట్లకు పై మాటే. మరో విశేషం ఏమిటంటే సత్యశంకర్ కోసంప్రత్యేకంగా తయారు చేయబడిందన్న ఘనతను కూడా దక్కించుకున్నాడు. బెంగళూరు వీధుల్లో ఆటో నడపడం నుండి రోల్స్ రాయిస్ వరకు, అతని కథ నిజంగా ఆశ, ధైర్యం ,విజయంతో కూడుకున్నది. ఆలోచనలకు, ఆవిష్కరణ హద్దులు లేవన్న స్ఫూర్తికి నిదర్శనం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement