పాకిస్థాన్ తీరు మారలేదు. అంతర్జాతీయ సరిహద్దు విభాగ రక్షణ దళానికి చెందిన ఉన్నత స్థాయి అధికారులు మూడు రోజులపాటు ఓ చోట కూర్చుని చర్చించినా ఫలితం రాలేదు.
జమ్మూ: పాకిస్థాన్ తీరు మారలేదు. అంతర్జాతీయ సరిహద్దు విభాగ రక్షణ దళానికి చెందిన ఉన్నత స్థాయి అధికారులు మూడు రోజులపాటు ఓ చోట కూర్చుని చర్చించినా ఫలితం రాలేదు. బుధవారం మరోసారి ఆ దేశం సైనికులు హద్దు మీరారు.
గంటల వ్యవధిలోనే పూంచ్ సెక్టార్లో రెండుసార్లు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. ఆటోమేటిక్ ఆయుధాలతో, మోర్టార్ షెల్స్తో కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం ధీటుగా వారిని ఎదుర్కొని దాడులను తిప్పికొట్టింది. పూంచ్ సెక్టార్ తోపాటు కృష్ణఘాట్ సెక్టార్లో పాక్ సైన్యం దుశ్చర్యలకు దిగింది. ఈ నెలలో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడటం 17వ సారి.