పాకిస్థాన్ స్వాతంత్ర దినోత్సవ సంబరాల సందర్భంగా జమ్మూ,కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణారేఖ వద్ద పాక్, భారత జవాన్లు స్వీట్లు పంచుకుని సామరస్యాన్ని చాటారు
సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత, పాక్ జవాన్లు!
Aug 15 2014 12:00 AM | Updated on Sep 2 2017 11:52 AM
జమ్మూ: పాకిస్థాన్ స్వాతంత్ర దినోత్సవ సంబరాల సందర్భంగా జమ్మూ,కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణారేఖ వద్ద పాక్, భారత జవాన్లు స్వీట్లు పంచుకుని సామరస్యాన్ని చాటారు. కాల్పుల ఒప్పంద నిబంధనల్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని ఆరోపణలు వచ్చిన 24 గంటల్లోనే ఈ ఘటన ఇరుదేశాల జవాన్ల మధ్య చోటుచేసుకోవడం అందర్ని ఆకట్టుకుంది.
నియంత్రణారేఖ సమీపంలోని చకన్ దా బాగ్, హాట్ స్పింగ్ మెందార్ పాయింట్ల వద్ద ఇరుదేశాలకు చెందిన జవాన్తు గురువారం రాత్రి స్వీట్లు పంచుకున్నట్టు సైనికాధికారి వెల్లడించారు. నియంత్రణా రేఖ వద్ద సామరస్యం నెలకొనాలని ఇరుదేశాల అధికారులు అశాభావం వ్యక్తం చేశారు. గత ఆరు రోజుల్లో హమీర్ పూర్, బాలకోటే ప్రాంతాల్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పూంచ్ జిల్లా పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement