
శ్రీనగర్: భారత్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించేందుకు సుమారు 300 మంది ఉగ్రవాదులు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి ఏర్పాటు చేసుకున్న లాంచ్ప్యాడ్స్లో సిద్ధంగా ఉన్నారని భారత ఆర్మీ శనివారం వెల్లడించింది. ముఖ్యంగా నౌగర్ సెక్టార్ ప్రాంతంలో ఉన్న లాంచ్ ప్యాడ్లు ఉగ్రవాదులతో కిక్కిరిసిపోయాయని, వారు ఏ క్షణంలోనైనా ఇండియాలోకి చొరబడే అవకాశం ఉందని మేజర్ జనరల్ వీరేంద్ర వాత్స్ వెల్లడించారు. 250 నుంచి 300 మంది టెర్రరిస్టులు దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాల ద్వారా తెలిసిందని చెప్పారు. (కరోనా : చైనాపై మరో బాంబు)
ఈ రోజు తెల్లవారుజామున కుప్వారాలో ఎల్వోసీ దాటి భారత్‌లోకి చొరబడిన ఇద్దరు టెర్రరిస్టులను సైన్యం హతమార్చింది. వారి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రూ.1.50 లక్షల విలువ చేసే ఇండియా, పాకిస్తాన్ కరెన్సీని స్వాధీనం చేసుకుంది.(మారణహోమానికి పాక్ కుట్ర)
Comments
Please login to add a commentAdd a comment