
పాక్ కాల్పులు.. ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్ము: పాకిస్తాన్ సైన్యం పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తాజాగా గురువారం తెల్లవారుజామున పూంఛ్ సెక్టార్‌లోని ఎల్‌వోసీ వెంట పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లకు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన భారత బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.