బిర్యానీ, దోశ, స్వీట్స్.. ఇలా ఏదైనా తినాలని అనిపిస్తే వెంటనే ఏం చేస్తాం.. హా ఇంట్లో వండుకొని తింటాం అంటారా.. కానీ ఇప్పుడంతా ఏమంటున్నారో తెలుసా..? వండుకునేంత టైం లేదండీ ఆన్‌లైన్‌లో ఫుండ్ ఆర్డర్ చేసుకొని లాగించడమే అని అంటున్నారు. అందరూ కాకపోయినా చాలా మంది ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌లవైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు దీనికి ఉన్న డిమాండ్ అలాంటిది మరి. ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసి పేమెంట్ చేస్తే చాలు.. నిమిషాల్లో ఫుడ్ డెలివరీ అవుతుంది.
ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు.. ప్రిపరేషన్, డెలివరీ బాయ్ పికప్, ఆర్డర్ డెలివరీ ఎప్పుడు అవుతుందో ట్రాకర్ ద్వారా తెలుసుకోవచ్చు. సాధారణంగా డెలివరీ ట్రాకింగ్ ఇంటర్ ఫేస్‌లో బైక్‌పై వ్యక్తి ట్రావెల్ చేస్తూ వస్తున్నట్లు చూపిస్తుంది. తాజాగా స్విగ్గీ ఓ వినూత్న ప్రయోగం చేసింది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతున్న హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్‌ను తమ ప్రమోషన్ కోసం వాడుకుంది. దీంతో ఫుడ్ ఆర్డర్ చేస్తే ట్రాకింగ్‌లో డెలివరీ పార్ట్‌నర్ బైక్ ప్లేస్‌లో స్విగ్గీ డ్రాగన్‌గా మార్చింది.
చదవండి: Viral Photo: దారుణం.. చావు ఇంట్లో నవ్వులు.. ఫ్యామిలీ ఫోటోపై ట్రోలింగ్..
స్విగ్గీలో ఆర్డర్ ట్రాకింగ్‌లో ‘ఆకలితో ఉండకండి. మా డ్రాగన్ మీ ఫుడ్‌ను డెలివరీ చేస్తాడు’ అనే ట్యాగ్‌లైన్‌తో కనిపిస్తోంది. అంటే మన ఆర్డర్‌ను డ్రాగన్ డెలివరీ చేస్తున్నట్లు కస్టమర్లు ఫీల్ అయ్యేలా ఆలోచన చేసింది. ఇక స్విగ్గీలో కొత్తగా హౌజ్ ఆఫ్ డ్రాగన్ థీమ్ కనిపించడంతో నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. ఆర్డర్ ట్రాకింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ స్విగ్గీ క్రియెటివిటీని మెచ్చుకుంటున్నారు.
చదవండి: చైన్ స్నాచర్ల కోసం జొమాటో డెలివరీ బాయ్‌గా మారిన ముంబై పోలీసులు.. 3 రోజులపాటు
Comments
Please login to add a commentAdd a comment