వైరల్: మంచి కంటే చెడునే తొందరగా మనిషి దృష్టిని ఆకర్షిస్తుంది. అందునా సోషల్ మీడియాలోనూ అదే తరహా కంటెంట్‌పై ఎక్కువగా చర్చ నడుస్తుంటుంది కూడా. అలా చేశారు.. ఇలా చేశారు అంటూ డెలివరీ బాయ్‌లు/ఏజెంట్‌ల గురించి రకరకాల కథనాలు వైరల్ అవుతుంటాయి. ఎంతసేపు నెగెటివ్ విషయాలేనా? అప్పుడప్పుడు మంచిపై కూడా ఓ లుక్కేద్దాం.
తారిఖ్ ఖాన్ అనే వ్యక్తి.. లింకెడ్‌ఇన్‌లో ఈమధ్య ఓ పోస్ట్ షేర్ చేశారు. ఎలివేటర్‌లో ఉండగా ఓ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ఆయన దృష్టిని ఆకర్షించారట. అతని కాళ్లకు చెప్పులు, షూస్ లేకుండా కనిపించాడట. ఎందుకలా వచ్చావ్? అని అడిగితే.. దారిలో చిన్నయాక్సిడెంట్ అయ్యిందని, చెప్పులు ఎక్కడో పడిపోయాయని, పైగా కాలికి గాయంతో వాపు వచ్చిందని, అందుకే వేసుకోలేదని చెప్పాడు ఆ డెలివరీబాయ్.
అలాంటప్పుడు పని ఆపి కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అతనికి సూచించాడు తారిఖ్. దానికి అతను నవ్వుతూ.. ‘నాకంటూ ఓ కుటుంబం ఉంది సార్. ఆ కుటుంబాన్ని పోషించుకోవాలి కదా’’ అంటూ లిఫ్ట్ బయటకు వెళ్లిపోయాడు. పోతూ పోతూ మర్యాదపూర్వకంగా శుభసాయంత్రం సార్ అని చెప్పివెళ్లిపోయాడు అని తారిఖ్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. కష్టపడి పనిచేయడానికి, అవసరమైన వేళలో నన్ను నేను ముందుకు వెళ్లడానికి ఇతనిలాంటి వ్యక్తులే నాకు స్ఫూర్తి అంటూ తారిఖ్ ఖాన్ లింకెడ్‌ఇన్‌లో ఆ పోస్ట్ షేర్ చేశారు. అంతేకాదు.. అతనికి సాయం కూడా అందించాడు.
సదరు కంపెనీ కూడా ఆ డెలివరీ బాయ్ లాంటి వాళ్ల కష్టాన్ని గుర్తించాలని కోరాడు తారిఖ్. అతనికి ఎవరైనా సాయం చేయాలని అనుకుంటే.. తనకు సందేశం పంపాలని, ఆ డెలివరీ ఏజెంట్ పేటీఎం నెంబర్ ఇస్తానని చెప్పాడు తారిఖ్. ఎక్కడ జరిగిందో క్లారిటీ లేకపోయినా.. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా దృష్టిని విపరీతంగా ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment