
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్, డెలివరీ కంపెనీ స్విగ్గీ పరిశ్రమలో తొలిసారిగా వినూత్న ఫీచర్‌ను పరిచయం చేసింది. ఫుడ్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఇన్‌కాగ్నిటో మోడ్ ద్వారా వినియోగదార్లు ప్రైవేటుగా ఆర్డర్ చేయవచ్చు. అంటే ఆర్డర్ వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంటాయి.
ఇన్‌కాగ్నిటో మోడ్ యాక్టివేట్ చేస్తే చాలు. యాప్ హిస్టరీలో ఆర్డర్ వివరాలు ఎక్కడా కనిపించవు. ఆర్డర్ వివరాలను మాన్యువల్‌గా డిలీట్ చేసే అవసరం లేదని కంపెనీ చెబుతోంది. ఆర్డర్ తాలూకు ఉత్పత్తులు డెలివరీ అయ్యాక ఏవైనా సమస్యలు ఉంటే మూడు గంటలపాటు ట్రాక్ చేసేందుకు వీలు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment