Incognito
-
స్విగ్గీలో ‘సీక్రెట్’ ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్, డెలివరీ కంపెనీ స్విగ్గీ పరిశ్రమలో తొలిసారిగా వినూత్న ఫీచర్‌ను పరిచయం చేసింది. ఫుడ్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఇన్‌కాగ్నిటో మోడ్ ద్వారా వినియోగదార్లు ప్రైవేటుగా ఆర్డర్ చేయవచ్చు. అంటే ఆర్డర్ వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంటాయి. ఇన్‌కాగ్నిటో మోడ్ యాక్టివేట్ చేస్తే చాలు. యాప్ హిస్టరీలో ఆర్డర్ వివరాలు ఎక్కడా కనిపించవు. ఆర్డర్ వివరాలను మాన్యువల్‌గా డిలీట్ చేసే అవసరం లేదని కంపెనీ చెబుతోంది. ఆర్డర్ తాలూకు ఉత్పత్తులు డెలివరీ అయ్యాక ఏవైనా సమస్యలు ఉంటే మూడు గంటలపాటు ట్రాక్ చేసేందుకు వీలు ఉంటుంది. -
‘ఇన్‌కాగ్నిటో మోడ్’లో బ్రౌజింగ్ సేఫ్ కాదు!
Google Incognito Browsing Mode Alleges Tracking Users: టెక్నాలజీ అప్డేట్ అవుతున్నా కొద్దీ.. టెక్ దిగ్గజాల లోటుపాట్లు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ క్రమంలో జనాలు ఎక్కువగా ఉపయోగించే గూగుల్‌కి సంబంధించి సంచలన ఆరోపణలపై కోర్టు విచారణ కొనసాగుతుండగా.. తాజా వాదనల సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేరు ప్రస్తావనకు రావడం విశేషం. సెర్చింజన్ గూగుల్ క్రోమ్‌లో ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ మోడ్ తెలుసు కదా!. సెర్చ్ హిస్టరీ ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో.. వ్యక్తిగతంగా సెర్చ్ చేసుకునేందుకు గూగుల్ యూజర్లకు కల్పించిన వెసులుబాటు ఇది. అయితే ఇందులోని సమాచారాన్ని సైతం గూగుల్ రహస్యంగా సేకరిస్తోందని, యూజర్ భద్రతకు గ్యారంటీ లేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కిందటి ఏడాది కాలిఫోర్నియా కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతుండగా.. గురువారం ఆరోపణలకు సంబంధించిన కీలక ఆధారాలను పిటిషనర్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ఇన్‌కాగ్నిటో బ్రౌజింగ్ అనేది సురక్షితం కాదని, గూగుల్‌కు అన్నీ తెలిసి కూడా ఈ విషయాన్ని దాచిపెడుతోందన్నది తాజా ఆరోపణ. సుందర్ పిచాయ్ పేరు.. 2019లో గూగుల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ లొర్రాయిన్ ట్వోహిల్ నేతృత్వంలో ఓ ప్రాజెక్టు జరిగింది. ఆ ప్రాజెక్టు సమయంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇన్‌కాగ్నిటో మోడ్ బ్రౌజింగ్ మీద అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌కాగ్నిటో మోడ్ అనే ‘ప్రైవేట్’ బ్రౌజింగ్ వ్యవస్థలో బోలెడన్ని సమస్యలున్నాయని, తనకు ఆ ఫీచర్ అవసరం లేదని అనిపిస్తోందని సుందర్ ఆ ప్రాజెక్టు సందర్భంగా అభిప్రాయపడినట్లు సమాచారం. యూజర్‌ను ట్రాక్ చేసే ఈ వ్యవస్థ వల్ల వ్యక్తిగత డేటా లీక్ అయ్యే అవకాశమూ లేకపోలేదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ అంతపెద్ద సమస్య తెలిసి కూడా ఆయన సీక్రెట్ బ్రౌజింగ్ మోడ్‌ను ప్రమోట్ చేశారనేది ఆరోపణ. ఈ మేరకు గూగుల్ కంపెనీకి సంబంధించిన కీలక పత్రాలను పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. మరోవైపు ఈ పిటిషన్‌పై గూగుల్ ప్రతినిధి జోస్ కాస్టానెడా స్పందించారు. సెకండ్, థర్డ్‌హ్యాండ్ అకౌంట్లకు సంబంధించిన తప్పుడు ఈమెయిల్స్ ద్వారా సేకరించిన సమాచారంతో గూగుల్‌ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. యూజర్ల వ్యక్తిగత భద్రత విషయంలో నిఘా ద్వారా ఉల్లంఘనలకు పాల్పడుతోందని గూగుల్ మీద ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తుండగా.. గూగుల్ మాత్రం ఇన్‌కాగ్నిటో మోడ్ ద్వారా యూజర్లకు వచ్చే ముప్పేమీ లేదని స్పష్టం చేస్తోంది. క్లిక్ చేయండి: గూగుల్ క్రోమ్‌లో వెతుకుతున్నారా? అయితే ఈ పని చేయండి! చదవండి: ఈ పిల్ల వయసు ఎప్పటికీ 22!! -
పెగ్గుబాబులు పరార్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్‌లో మందుబాబుల పనిపడుతుంటే.. చిక్కినవారు పోలీసుకుల చుక్కలు చూపెడుతున్నారు. స్పెషల్ డ్రైవ్‌లో పట్టుపడిన పెగ్గుబాబులు స్పాట్ లో వాహనాన్ని వదిలేసి.. వారంరోజుల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. దీనికి కు టుంబ సభ్యులతో సహా హాజరు కావాలి. తర్వాత కోర్టులో శిక్ష.. వీటి నుంచి తప్పించుకునేందుకు పట్టుబడ్డవారు వాహనాన్ని పోలీసుల వద్దే వదిలేసి మళ్లీ రావడం లేదు. గతేడాది నవంబర్ వరకు సిటీ పోలీసుల నిర్వహించిన స్పెషల్ డ్రైవ్స్‌లో 17,265 మంది మందుబాబులు వాహæనాలు నడుపుతూ చిక్కారు. వీరిలో కుటుంబీకులు/సంరక్షకుల పర్యవేక్షణలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో (టీటీఐ) కౌన్సిలింగ్ హాజరైన వారిని కోర్టుల్లో హాజరుపరగా.. 3,803 మందికి జైలు శిక్ష పడింది. ఆ రెండు భయాల నేపథ్యంలో.. స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడిన ‘నిషా’చరులు సాధారణంగా ఆ తరువాతి వారంలో టీటీఐలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. ఈ ‘కార్యక్రమానికి’ వారితో పాటు కుటుంబంలో ఎవరో ఒకరిని తీసుకురావాలి. వివాహితులు భార్య, అవివాహితులు తల్లిదండ్రులు, సోదరుడు, సంరక్షకులతో కలిసి హాజరుకావాలి. మందుబాబుల్లో చాలా మంది విషయం కుటుంబీకులకు తెలియడానికి ఇష్టపడక కౌన్సెలింగ్‌కు హాజరుకావడం లేదు. ఈ అంశంలో సమస్య లేని వారికి కోర్టు భయం పట్టుకుంటోంది. కౌన్సెలింగ్ తర్వాత ట్రాఫిక్ పోలీసులు సదరు మందుబాబును కోర్టులో హాజరు పరుస్తారు. పట్టుబడిన సమయంలో వారు తీసుకున్న మద్యం మోతాదును బట్టి న్యాయస్థానం వీరికి జైలు శిక్షలు సైతం విధించే ఆస్కారం ఉంది. దీనికి భయపడుతున్న మరికొందరు ట్రాఫిక్ పోలీసులకు ‘దూరంగా’ ఉంటున్నారు. వారి ‘ఆధార్’ సరిపోవాల్సిందే.. కౌన్సెలింగ్‌కు హాజరుకావడంతో కొందరు మందుబాబులు తెలివిగా వ్యవహరిస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. స్నేహితులు, పరిచయస్తుల్ని తమ కుటుంబికులుగా చూపి స్తూ కౌన్సెలింగ్‌కు వస్తున్నారు. ఇలాంటి వారికి చెక్ చెప్పడానికి ట్రాఫిక్ పోలీసుల ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తున్నారు. ‘నిషా’చరుడితో పాటు అతడితో వచ్చిన వారి ఆధార్ వివరాలను సరిచూస్తున్నారు. దీంతో మరికొందరు మందు బాబులు కౌన్సెలింగ్‌కు రావడం లేదు. ఈ కారణాల నేపథ్యంలో నగరంలోని 25 ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో అనేక వాహనాలు పేరుకుపోతున్నాయి. వీటిని సంరక్షించడం పోలీసు లకు తలకు మించిన భారంగా మారుతోంది. అలాగని కౌన్సెలింగ్ లేకుండా నేరుగా కోర్టుకు తరలిస్తే న్యాయమూర్తులు ఉపేక్షించని పరిస్థితులు ఉన్నాయి. ఇలా గత ఏడాది నవంబర్ వరకు 17,265 మంది ‘నిషా’చరులు పోలీసులకు చిక్కగా.. 2,500 మంది కౌన్సెలింగ్‌కు రాకుండా వాహనాలను వదిలేశారు. ‘150’ దాటితే జైలే.. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని బ్రీత్ అనలైజర్ల ద్వారా పరీక్షించి గుర్తిస్తారు. బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ (బీఏసీ) ‘30 ఎంజీ ఇన్ 100 ఎంఎల్ బ్లడ్’ కంటే ఎక్కువ ఉంటేనే ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారు. అంటే సదరు వ్యక్తి రక్తంలో ప్రతి 100 మిల్లీలీటర్లకు 30 మిల్లీ గ్రాముల ఆల్కహాల్ ఉన్నట్లు లెక్క. ఈ బీఏసీ కౌంట్ 150 కంటే ఎక్కువ నమోదైతే కోర్టులు సీరియస్‌గా తీసుకుని.. ఒక రోజు నుంచి 15 రోజుల వరకు జైలు శిక్షలు విధిస్తున్నాయి. డిసెంబర్ 31న చిక్కిన ప్రదీప్‌కు ఈ కౌంట్ 178 వచ్చింది. దీంతో తనకు జైలు శిక్ష తప్పదనే భావన, మీడియా భయంతోనే అతడు ‘అజ్ఞాతం’లో ఉండి ఉండచ్చని ట్రాఫిక్ పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. నిర్ణీత సమయమంటూ లేదు.. డ్రంక్ డ్రైవింగ్ తనిఖీల్లో చిక్కిన వారి నుంచి తక్షణం వాహనం స్వాధీనం చేసుకుంటాం. గరిష్టంగా వారం రోజుల్లో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని చెబుతాం. ఇది ముగిసిన తర్వాతే కోర్టుకు తరలిస్తాం. అయితే అవసరమైతే ఈ గడువును పొడిగించుకోవచ్చు. తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తి ఇన్ని రోజుల్లో కౌన్సెలింగ్ కచ్చితంగా కావాలనే నిబంధన ఏదీ చట్టంలో లేదు. దీంతో అనేక వాహనాలు ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలో పేరుకుపోతున్నాయి. గరిష్టంగా ఆరు నెలల నుంచి ఏడాది పాటు వేచి చూసిన తర్వాత సదరు వ్యక్తి కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే అప్పుడు న్యాయస్థానంలో అతడిపై చార్జ్‌షీట్ దాఖలు చేస్తాం. కోర్టు వారెంట్ జారీ చేస్తే దాని ఆధారంగా సదరు వ్యక్తిని పట్టుకుని కోర్టుకు తరలిస్తాం. – ఏవీ రంగనాథ్, సిటీ ట్రాఫిక్ డీసీపీ -
అజ్ఞాతంలో మాజీ మంత్రి రమణ
తిరువళ్లూరు: జిల్లా రాజకీయాలను నాలుగున్నరేళ్లపాటు శాసించి చక్రం తిప్పిన మాజీ మంత్రి రమణ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఆయన మద్దతుదారుల్లో, అన్నాడీఎంకే శ్రేణుల్లోనూ నిరాశ ఏర్పడింది. తిరువళ్లూరు జిల్లా అన్నాడీఎంకే పార్టీ కన్వీనర్‌గా నాలుగున్నర సంవత్సరాల నుంచి రమణ విధులను నిర్వహించారు. 2011సంవత్సరంలో తిరువళ్లూరు నియోజకవర్గం నుంచి రమణ అన్నాడీఎంకే తరఫున ఎమ్మెల్యే గా గెలుపొందారు. అనంతరం జయలలిత మంత్రివర్గంలో చేనేత మంత్రిగా బాధ్యతలు స్వీకరించి అనతి కాలంలోనే కీలకమైన రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖ మంత్రి స్థాయికి ఎదిగారు. పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తూ, అప్పటి వరకు ఉన్న గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టి అన్నాడీఎంకే శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చారు. పార్టీ బలోపేతం కోసం తరచూ కార్యక్రమాలను నిర్వహించడం, నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వచ్చేవారు. తెరవెనుక రాజకీయాలు చేసి తిరువళ్లూరు జిల్లా అన్నాడీఎంకేలో ట్రబుల్షూటర్గా మారారు. గత రెండు సంవత్సరాల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి వేణుగోపాల్ గెలుపు కోసం అంతా తానై వ్యవహరించి రాష్ట్రంలోనే అత్యధిక మోజారిటీతో విజయాన్ని అందించారు. అయితే తదనంతరం రమణపై అధిష్ఠానానికి అనేక ఫిర్యాదులు వెల్లడంతో 2014లో మంత్రి పదవితో పాటు జిల్లా కన్వీనర్ పదవిని పోగొట్టుకున్నారు. అంతటితో రమణ శకం ముగిసిందని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేసిన రమణ, తనకు అధిష్ఠానం వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించి జోడు పదవులను సాధించి తన సత్తాను చాటారు. అయితే రమణ తన భార్యతో ఏకాంతంగా ఉన్న ఫొటోలు బయటకు రావడంతో రమణ జోడు పదవులను పోగొట్టుకున్నారు. దీంతో రమణ రెండు వారాల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.అయితే పార్టీ అధిష్ఠానం ఎన్నికల నాటికి జిల్లా శ్రేణులను ఏకతాటిపైకి తీసుకొచ్చి అన్ని స్థానాలను సాధించుకోవడానికి ప్రయత్నాలను ప్రారంభించింది. రమణ లాంటి నేత ఎన్నికల వేళ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం అధికార పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనడంలో సందేహం లేదు.