IFS Officer: Susanta Nanda Shares Portugal River Look Like Dragon - Sakshi
Sakshi News home page

ఈ విషయం తెలిస్తే చైనా ఆగుతుందా

Published Sat, Nov 27 2021 7:39 PM | Last Updated on Sun, Nov 28 2021 10:17 AM

IFS Officer Susanta Nanda Shares Portugal River Look Like Dragon - Sakshi

సాక్షి, నూఢిల్లీ: సోషల్‌ మీడియా వినియోగం పెరిగాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరుదైన, అబ్బురపరిచే విషయాల గురించి అందరికి తెలుస్తున్నాయి. ట్విటర్‌ను ఎక్కువగా ఫాలో అయ్యేవారికి ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత నంద తెలిసే ఉంటారు. అరుదైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటారు సుశాంత నంద. ఈ క్రమంలో తాజాగా ఆయన ట్వీట్‌ చేసిన ఓ ఫోటో తెగ వైరలవుతోంది. ఇక దీనిపై నెటిజనులు చేసే కామెంట్స్‌ చూస్తే.. విరగబడి నవ్వుతారు. ఇంతకు ఆయన షేర్‌ చేసిన ఫోటో.. ఆ వివరాలు..
(చదవండి: వైరల్‌ వీడియో: సృష్టికర్తకు జోహార్లు)

సుశాంత నంద తన ట్విటర్‌లో శనివారం ఓ ఫోటోని షేర్‌ చేశారు. సడెన్‌గా చూస్తే.. అది డ్రాగన్‌ ఫోటోనో, పెయింటింగో అనిపిస్తుంది. కానీ కాదు. అది పోర్చుగల్‌లో ప్రవహిస్తున్న ఓ నది. ఆకాశం నుంచి చూస్తే.. అది అచ్చాం డ్రాగన్‌ మాదిరే ఉంది. ఇక ఈ ఫోటోపై నెటిజనులు చేసే కామెంట్లు చూస్తే మైండ్‌ బ్లాంక్‌ అవుతుంది.
(చదవండి: ‘ఒకే ఫ్రేమ్‌లో 3 లెజెండ్స్‌.. కేటీఆర్‌ చాలా యంగ్‌గా ఉన్నారు’)

‘‘ఈ ఫోటోని చైనా వాడు చూస్తే.. మా డ్రాగన్‌లకు పోర్చుగల్‌ సంతోనోత్పత్తి కేంద్రంగా ఉంది. కనుక ఆ దేశం కూడా మాకు చెందినదే అంటుంది’’.. ‘‘ఇప్పటి నుంచి పోర్చుగల్‌ కూడా మా దేశంలో భాగమే. వారిని మాలో కలుపుకుంటాం అంటుంది’’ అని కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు. 
(చదవండి: అదృష్టం.. భూమ్మిద ఇంకా నూకలున్నాయ్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement