
అవును నిజంగా డ్రాగన్ కనిపించిందట!
చైనా బోర్డర్ లో నిజంగా డ్రాగన్ కనిపించిందంటా. చైనీయుల పురాణాల్లో డ్రాగన్లను గురించిన ప్రస్తావన ఉంది. అయితే డ్రాగన్లను ఎవరైనా చూశారా? అంటే లేదు. కేవలం చైనా పురాణ గాథలు, ఇతిహాసాల్లో మాత్రమే అవి ఉన్నాయి. కానీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలో ఓ డ్రాగన్ ఎగురుతున్నట్లు కనిపిస్తోంది. ఇవి అత్యంత శక్తిమంతమైన జీవులని చైనా పురాణాల్లో పేర్కొన్నారు. పవిత్ర శక్తులు కలిగివుండే డ్రాగన్లు నీరు, వర్షపాతం, ప్రకృతి విపత్తులు(వరదలు, తుపానులు)పై అధికారం కలిగివుంటాయని చైనీయుల నమ్మకం. దీంతో చైనాను పాలించిన రాజులు డ్రాగన్ ను వాళ్ల శక్తి, సామర్ధ్యాలకు గుర్తుగా ఎంపిక చేసుకున్నారు.
అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా చైనాను డ్రాగన్ దేశంగా పలకడం ప్రారంభమైంది. అంతేకాదు చైనా సంప్రదాయ భాషపై పట్టుకలిగిన వారిని సమకాలీన చైనీయులు డ్రాగన్ తో పోల్చుతారు. చైనా లో చాలా రకాల డ్రాగన్ల రూపాలు ఉన్నాయి. చేప, ఊహా జనిత చిత్రాలు, కప్పల ఆకారంలో డ్రాగన్ల చిత్రాలు అక్కడి పురాణ గ్రంథాల్లో అగుపిస్తాయి. వీటిలో నాలుగు కాళ్లు, రెండు భారీ రెక్కలు కలిగిన జంతువు డ్రాగన్ ఆకారంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
చైనా-లావోస్ బోర్డర్లో ఓ వ్యక్తి డ్రాగన్ ఓ పర్వతం వైపు ఎగురుతూ వెళ్తుండగా సెల్ ఫోన్ లో బంధించాడు. అయితే వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం పలు రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొందరు డ్రాగన్లు నిజంగానే ఉన్నాయంటే మరికొందరు ఇది టెక్నాలజీ మాయ అని కామెంట్ చేశారు. ఓ వ్యక్తి మాత్రం తాను చదివిన పుస్తకాల్లో శాస్త్రజ్ఞులు అచ్చం సహజ పక్షుల్లాగా ఎగిరే డ్రోన్లను తయారుచేస్తున్నారని ఇది అందులో ఒకటి కావొచ్చని అభిప్రాయ పడ్డాడు. డ్రాగన్లపై ప్రపంచవ్యాప్తంగా కామిక్ పుస్తకాలు, టీవీ షోలు, సినిమాలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.