'బేబి' నిర్మాత నుంచి మరో సినిమా.. ఈసారీ అలాంటి ప్రేమకథే | True Lover Movie Teaser And Release Date Details | Sakshi
Sakshi News home page

True Lover Movie: వాలంటైన్స్ డేకి థియేటర్లలోకి ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ

Published Mon, Jan 29 2024 4:50 PM | Last Updated on Mon, Jan 29 2024 5:01 PM

 True Lover Movie Teaser And Release Date Details - Sakshi

రీసెంట్ టైంలో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన లవ్ స్టోరీ అంటే చాలామంది చెప్పే పేరు 'బేబి'. ప్రస్తుతం చాలామందికి తెలిసిన కథనే సినిమాగా తీస్తే బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. నిర్మాతకు మూడు నాలుగు రెట్ల లాభాలు తీసుకొచ్చిందని టాక్. ఇప్పుడు ఆ నిర్మాత నుంచి మరో క్రేజీ లవ్ స్టోరీ మూవీ రాబోతుంది. తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్'.. ప్లాన్‌లో మార్పు.. వచ్చేది అప్పుడేనా?)

అయితే ఇది తెలుగు స్ట్రెయిట్ మూవీ కాదు. తమిళ ప్రేమకథ సినిమా. 'గుడ్ నైట్' చిత్రంతో గతేడాది హిట్ కొట్టిన మణికందన్.. ఇప్పుడు' ట్రూ లవర్'గా రాబోతున్నాడు. ఇందులో తెలుగమ్మాయి గౌరిప్రియ హీరోయిన్. తమిళంలో లవర్ పేరుతో తీసిన ఈ చిత్రాన్ని వాలంటైన్స్ డే కానుకగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. తెలుగులో ఫిబ్రవరి 9న రిలీజ్ కావొచ్చని అంటున్నారు.

టీజర్ బట్టి చూస్తుంటే.. ఇంజినీరింగ్ చదివేటప్పుడు అమ్మాయి-అబ్బాయి ప్రేమలో పడతారు. కాకపోతే ఈ అబ్బాయి మరీ ఎక్కువగా ప్రేమించేయడంతో అసలు సమస్యలు మొదలవుతాయి. అమ్మాయి వేరే ఏ అబ్బాయితో మాట్లాడినా సరే ఇతడు చిరాకుపడిపోతుంటాడు. కాస్త 'బేబి' పోలికలు కనిపిస్తున్న ఈ చిత్రాన్ని 'బేబి' ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, దర్శకుడు మారుతి కలిసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇది మరో 'బేబి' అవుతుందా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement