
'బేబి' నిర్మాత ఎస్కేఎన్ మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల అమలాపురంకు చెందిన పవన్ కృష్ణ అనే ఎన్టీఆర్ అభిమాని ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బాగా దెబ్బలు తగలడంతో.. ఇతడికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్స్ చెప్పారు. కానీ సదరు వ్యక్తి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో.. తోటి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫండ్స్ సేకరించే ప్రయత్నాలు చేశారు.
(ఇదీ చదవండి: అశ్లీలతతో నిండిన ఆ వెబ్‌సైట్స్, ఓటీటీ యాప్స్ బ్యాన్)
ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ వరకు చేరింది. దీంతో ఆయన ఎన్టీఆర్ అభిమానికి అండగా నిలబడ్డారు. అతనిది పేద కుటుంబం కావడంతో తన వంతు సాయంగా రూ.50 వేలు పంపించారు. ప్రస్తుతం ఈ విషయం ఫ్యాన్స్‌కి కాస్త ఊరటగా నిలిచింది. అలానే మిగతా సెలబ్రిటీలు కూడా చావు బతుకుల మధ్య ఉన్న పవన్ కృష్ణకి సాయం చేయాలని సదరు ఫ్యాన్స్ కోరుతున్నారు.
(ఇదీ చదవండి: ఆ నటితో నాకు సంతోషం లేదు.. అందుకే రెండో పెళ్లి!)