నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా "ఘటికాచలం". అమర్ కామెపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఓయాసిస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఎం.సి.రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత ఎస్‌కేఎన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - మారుతి గారు రాజా సాబ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండి రాలేకపోయారు.
చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలి
చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలే కీలకం. థియేటర్స్ ఫీడింగ్ అయ్యేదే చిన్న చిత్రాలతో.. చిన్న చిత్రాలు ప్రమోషన్ లేక, ప్రాపర్ రిలీజ్ లేక ప్రేక్షకులకు రీచ్ అవడం లేదు. అలాంటి చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలని మారుతి గారు, నేను, ధీరజ్ అనుకున్నాం. ఈ క్రమంలో ఘటికాచలం సినిమా చూశాం. సినిమా చూస్తున్నంతసేపూ టెక్నికల్ క్వాలిటీ బాగా ఆకట్టుకుంది. డైరెక్టర్ అమర్ గారు ఒక పది సినిమాలు చేసినంత ఎక్సీపిరియన్స్ ఉన్న దర్శకుడిలా మూవీ రూపొందించారు. నాకు హారర్ మూవీస్ చాలా ఇష్టం. భయపడినా ఇష్టపడుతూ హరర్ మూవీస్ చూస్తుంటా.
బేబి హిందీ వర్షన్ ఎక్కడిదాకా వచ్చిందంటే?
మ్యూజిక్ డైరెక్టర్ సూపర్బ్‌గా మ్యూజిక్ ఇచ్చారు. హారర్ మూవీ ఇవ్వాల్సిన ప్రతి అనుభూతిని ఘటికాచలం సినిమా ఇస్తుంది. నిఖిల్ నటన మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. అతనికి నేనిచ్చే సలహా ఏంటంటే ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేయమని, హీరోగా వస్తే హీరోగా, క్యారెక్టర్ వస్తే క్యారెక్టర్ లో నటించు. మా బేబీ సినిమా విషయానికి వస్తే ఈ మూవీ హందీ వెర్షన్ పనులు జరుగుతున్నాయి. ఇతర ప్రాజెక్ట్స్ పనులు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment