
జనాలు ఎంతగానో ఆదరించిన కల్కి మూవీపై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. సినిమా తనకు నచ్చలేదని, ప్రభాస్ లుక్ అయితే జోకర్‌లా ఉందని సెటైర్లు వేశాడు. ఈయన వ్యాఖ్యలు ఫిల్మీదునియాలోనే కాదు సోషల్ మీడియాలోనూ తీవ్ర దుమారం రేపాయి. ప్రభాస్‌కు అతడు సారీ చెప్పాల్సిందేనంటూ నెట్టింట డార్లింగ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఎక్స్ (ట్విటర్) వేదికగా అర్షద్ వ్యాఖ్యలపై నిర్మాత శ్రీనివాస కుమార్(ఎస్‌కేఎన్) ఫైర్ అయ్యాడు. వారి ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలా కష్టపడుతున్నారంటూ కామెంట్ చేశాడు. మరోవైపు నిర్మాత అభిషేక్ అగర్వాల్ సైతం స్పందిస్తూ.. సినిమాకు రివ్యూ ఇవ్వొచ్చు.. దాన్ని విమర్శించవచ్చు. కానీ అర్షద్ వార్సీ వ్యాఖ్యలు మాత్రం సద్విమర్శలుగా లేవు. కాస్త ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది అని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment