ప్రభాస్‌ జోకర్‌లా కనిపించాడు.. కల్కిపై బాలీవుడ్‌ నటుడి సెటైర్లు | Arshad Warsi Slams Prabhas Look in Kalki 2898 AD, Calls Him Joker | Sakshi
Sakshi News home page

నాకు కల్కి నచ్చలేదు.. ప్రభాస్‌ లుక్‌ జోకర్‌లా ఉంది: నటుడి సెటైర్లు

Published Sun, Aug 18 2024 5:22 PM | Last Updated on Sun, Aug 18 2024 5:50 PM

Arshad Warsi Slams Prabhas Look in Kalki 2898 AD, Calls Him Joker

ప్రభాస్‌ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఏకంగా రూ.1200 కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 22న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లోనూ అందుబాటులోకి రానుంది.

కల్కి  నచ్చలేదు
ఈ క్రమంలో బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వర్సి.. ప్రభాస్‌ లుక్‌ బాగోలేదంటూ సంచలన కామెంట్లు చేశాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. నేను కల్కి సినిమా చూశాను. నాకసలు నచ్చలేదు. ప్రభాస్‌ అయితే జోకర్‌లా ఉన్నాడు. తననలా చూసి బాధేసింది. ఈ సినిమాను మ్యాడ్‌ మాక్స్‌ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్‌ చేశాను. 

ప్రభాస్‌పై ఏడుపు
కానీ ఆ రేంజ్‌లో తెరకెక్కించడంలో దర్శకనటులు ఫెయిలయ్యారు అని చెప్పుకొచ్చాడు. ఇతడి కామెంట్లపై సోషల్‌ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లమంది ఆదరించిన సినిమాపై ఇలా విషం చిమ్ముతున్నాడేంటి? అయినా వీళ్లెప్పుడూ ప్రభాస్‌ మీద ఏడుస్తూనే ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement