ఆ గ్యాప్‌లో లవ్‌ మీ చేశా: ఆశిష్‌ | Hero Ashish Talk About Love Me Movie | Sakshi
Sakshi News home page

ఆ గ్యాప్‌లో లవ్‌ మీ చేశా: ఆశిష్‌

Published Thu, May 23 2024 10:38 AM | Last Updated on Thu, May 23 2024 10:38 AM

Hero Ashish Talk About Love Me Movie

ఆశిష్, వైష్ణవీ చైతన్య జంటగా నటించిన చిత్రం ‘లవ్‌ మీ’. శిరీష్‌ సమర్పణలో ‘దిల్‌’ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఆశిష్‌ విలేకర్లతో మాట్లాడుతూ– ‘‘లవ్‌ మీ’లో నేను అర్జున్‌ అనే యూ ట్యూబర్‌ పాత్ర చేశాను. ఎవరైనా ఏదైనా చేయవద్దు అంటే ఆ పని చేయాలనుకునే స్వభావం నా పాత్రకు ఉన్న ఓ లక్షణం. ‘లవ్‌ మీ’లో హారర్‌ అనేది ఓ భాగం మాత్రమే. ఇందులో మంచి లవ్‌స్టోరీ, చక్కని ఎమోషన్స్‌ ఉన్నాయి.  కీరవాణి, పీసీ శ్రీరామ్‌గార్లు ఈ సినిమా ఒప్పుకోవడం మా తొలి విజయంగా భావించాం. 

కథలో పట్టు లేకపోతే వారు ఒప్పుకునేవారు కాదు కదా. ‘లవ్‌ మీ’కు సీక్వెల్‌ చేయవచ్చు. కానీ అది ‘దిల్‌’ రాజుగారి చేతిలో ఉంది. ‘రౌడీ బాయ్స్‌’ తర్వాత యాభైకి పైగా కథలు విన్నాను. అలా నా రెండో చిత్రంగా ‘సెల్ఫిష్‌’ స్టార్ట్‌ చేశాం. కానీ ఈ మూవీలోని క్యారెక్టర్‌ను మరింత బాగా చూపించవచ్చని కథపై మళ్లీ వర్క్‌ స్టార్ట్‌ చేశాడు ఈ చిత్రదర్శకుడు కాశీ. ఈ గ్యాప్‌లో నేను ‘లవ్‌ మీ’ చేశాను. ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌’లో సినిమా కమిట్‌  అయ్యా. మరో రెండు కథలు విన్నాను’’ అని చెప్పుకొచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement