
69వ ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో ‘బేబి’ సినిమా సత్తా చాటింది. 8 నామినేషన్స్‌లో ఏకంగా 5 అవార్డులను దక్కించుకొని చరిత్ర సృష్టించింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాది జులైలో విడుదలై ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
(చదవండి: Filmfare South 2024: ఆ మూడు సినిమాలకే దాదాపు అవార్డులన్నీ..)
కేవలం కలెక్షన్స్ పరంగానే కాకుండా అవార్డుల పరంగానూ ‘బేబి’ దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్‌ల్లోనూ ఐదు అవార్డులను సొంతం చేసుకుంది. బేబి సినిమాలో ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చిన వైష్ణవి చైతన్య బెస్ట్ యాక్ట్రెస్ గా, క్లాసిక్ ఇమేజ్ తో పాటు కమర్షియల్ సక్సెస్ సాధించి 100 కోట్ల గ్రాసర్ గా నిలిచినందుకు బెస్ట్ ఫిల్మ్ గా అవార్డు సొంతం చేసుకుంది.
(చదవండి: ఒక్క సినిమాకు ఆరు అవార్డులు.. కోలీవుడ్‌లో ఎవరికి వచ్చాయంటే?)
అలాగే తన మ్యూజిక్ తో బేబికి ప్రాణం పోసిన విజయ్ బుల్గానిన్ బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా, ఓ రెండు మేఘాలిలా పాటతో టైటిల్స్ నుంచే సినిమాలో ప్రేక్షకుల్ని లీనం చేసేలా సాహిత్యాన్ని అందించిన అనంత్ శ్రీరామ్ కు బెస్ట్ లిరిసిస్ట్ గా, ఈ పాట అందంగా పాడిన శ్రీరామ చంద్ర బెస్ట్ సింగర్ గా అవార్డ్స్ దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment