‘బేబీ’ సినిమాతో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు తెలుగు అమ్మాయి వైష్ణవీ చైతన్య. ప్రస్తుతం ‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న ‘జాక్’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. తాజాగా ఈ యంగ్ బ్యూటీ ముచ్చటగా మూడు సినిమాలకు సైన్ చేశారని సమాచారం.
అది కూడా తెలుగులో కాదు... తమిళంలో రెండు సినిమాలు, కన్నడంలో ఓ స్టార్ హీరో ఫిల్మ్‌లో హీరోయిన్‌గా వైష్ణవి అవకాశం దక్కించుకున్నారని తెలిసింది. అలానే తెలుగులోనూ సినిమాలు చేసేందుకు వైష్ణవి కథలు వింటున్నారు. ఇలా ఈ ఏడాది వైష్ణవీ చైతన్య ఫుల్ బిజీగా ఉంటారని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment