సాక్షి, హైదరాబాద్ : బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని ఆ పార్టీ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి అన్నారు. నాగం కాంగ్రెస్‌లోకి వస్తే పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. నాగం పార్టీలో చేరితే.. పార్టీకి నష్టమేనని అన్నారు. నాగం క్యాడర్ లేని లీడర్ అని ఎద్దేవా చేశారు. నాగంను అభ్యర్థిగా నిలబడితే.. ఆయన ఓడిపోవడం ఖాయమని అన్నారు.
నాగంను పార్టీలోకి తీసుకుంటే.. తాము ఎట్టి పరిస్థితుల్లో సహకరించబోమని దామోదర్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను, డీకే అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి నాగంను తీసుకోవడం వల్ల జరిగే పరిణామాలను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరించామని తెలిపారు. నాగం, జైపాల్ రెడ్డి మధ్య అండర్ స్టాండింగ్ ఉందని, రేపు జైపాల్ రెడ్డి లోక్‌సభకు పోటీచేయకపోతేనే.. నాగంను కాంగ్రెస్‌లోకి తీసుకోవాలని షరతు పెట్టారు. నాగంను కావాలనే జైపాల్ రెడ్డి పార్టీలోకి తెస్తున్నారని అన్నారు. గత ఎన్నికల్లో నాగం ఎంపీ అభ్యర్థిగా, ఆయన కొడుకును ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తే.. వారికి డిపాజిట్ కూడా రాలేదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment