![Sama Damodar Reddy Complaint To Police For Threatening Calls - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/27/Sama-Damodar-Reddy-Complaint.jpg.webp?itok=ZlXTt4eK)
ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డి హత్య కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సామ దామోదర్‌రెడ్డిని చంపుతామంటూ ఫోన్ చేసి.. 27న ముహూర్తం అంటూ ఓ సుపారీ గ్యాంగ్ బెదిరించింది. రూ. 50 లక్షలు అడ్వాన్స్ ముట్టిందని.. దామోదర్ రెడ్డిని హత్య చేయడానికి కోటి రూపాయల డీల్ కుదిరిందని వీడియో పంపించారు.
బీహారీ గ్యాంగ్ క్షణాల మీద నిన్ను చంపి పడేస్తారంటూ వారి ఫోటోలు ఓ దుండగుడు దామోదర్‌రెడ్డికి పంపించాడు. దీంతో తనకు ప్రాణహాని ఉందని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో దామోదర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. జీవన్‌రెడ్డి తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని దామోదర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. శంకర్ పల్లిలోని చైతన్య రిసార్ట్ భూమి షయంలో కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment