సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డిపై అవిశ్వాస తీర్మానంపై నెలకొన్న ఉత్కంఠకు గురువారం తెరపడనుంది. 11 మంది డెరైక్టర్లు ఇచ్చిన నోటీసు మేరకు నిర్వహిస్తున్న డీసీసీబీ ప్రత్యేక సమావేశంలో ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా? వీగిపోతుందా? అనేది తేలనుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గించుకునేందుకు వైస్ చైర్మన్ చంద్ర శేఖర్‌రెడ్డి పావులు కదుపుతుండగా, పదవిని కాపాడుకునేందుకు చైర్మన్ దామోదర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇరువురు తమకు మద్దతిస్తున్న డెరైక్టర్లతో క్యాంపులు నిర్వహిస్తున్నారు.
గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వైస్ చైర్మన్ మద్దతు డెరైక్టర్లు నేరుగా సమావేశానికి రావాల ని నిర్ణయించారు. చైర్మన్ వర్గీయులు సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశాలున్నాయి. 11మంది డెరైక్టర్లు హాజరైన పక్షంలో కోరం ఉన్నట్లుగా భా వించి సమావేశాన్ని ప్రారంభిస్తారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి చైర్మన్ కాకుండా జిల్లా సహకార అధికారి అధ్యక్షత వహించనున్నారు.
సమావేశం ప్రారంభమైతే అవిశ్వాసం అంశంపై రెండు గం టలపాటు చర్చ జరుగుతుంది. అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 14 మంది డెరైక్టర్ల మద్దతు అవసరం ఉంటుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గిన పక్షంలో చైర్మన్‌కు రిమూవల్ నోటీసులు జారీ చేయనున్నారు. వీగిపోయిన పక్షంలో మరో ఏడాదిపాటుగా అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు లేకుండా పోనున్నాయి.
పకడ్బందీ ఏర్పాట్లు
ఈ ప్రత్యేక సమావేశ నిర్వహణకు సహకార శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. డీసీసీబీ వద్ద 144సెక్షన్ విధించారు. డీసీసీబీ సీఈవోతోపాటు, డీజీఎంకు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొనేందుకు అనుమతించారు. ఈ సమావేశానికి హాజరయ్యే ఉద్యోగులు, అధికారులకు ప్రత్యేక పాసులు జారీ చేశారు.
దామోదర్‌రెడ్డికి తప్పనున్న పదవీ గండం?
చైర్మన్ దామోదర్‌రెడ్డికి పదవి గండం తప్పే అవకాశాలున్నాయి. తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా మెజారిటీ డెరైక్టర్లతో ఆయన క్యాంపు నిర్వహిస్తున్నారు.
నువ్వా? నేనా?
Published Thu, Aug 7 2014 12:47 AM | Last Updated on Wed, Oct 17 2018 6:22 PM
Advertisement
Advertisement