సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేడు కాంగ్రెస్ పారీ్టలో చేరనున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేశ్‌రెడ్డి, వనపర్తి ఎంపీపీ మేఘారెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు శ్రీవర్ధన్ తదితరులు బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇందుకోసం వీరంతా ఢిల్లీ వెళ్లారు.
లోక్‌సభ సమావేశాలకు హాజరవుతున్న పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉండగా, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మరో ముఖ్య నేత, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లురవి కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ ఇద్దరు నేతలు, మల్లికార్జున ఖర్గే సమక్షంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు జూపల్లి తదితరులు పారీ్టలో చేరుతారని గాందీభవన్ వర్గాలు తెలిపాయి. వీలైతే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ లేక ప్రియాంకాగాంధీ ఈ చేరిక కార్యక్రమానికి రావొచ్చని అంటున్నారు.
ప్రియాంకా సమక్షంలో చేరాల్సి ఉన్నా..
వాస్తవానికి, కొల్లాపూర్‌లో జరగాల్సిన బహిరంగసభలో ప్రియాంకాగాం«ధీ సమక్షంలో వీరంతా కాంగ్రెస్ పారీ్టలో చేరాల్సి ఉంది. కానీ, ఇప్పటికే రెండు సార్లు ఈ సభ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రియాంకాగాంధీ సభ ఇక రద్దయినట్టేనని తెలుస్తోంది. అయితే సభ రద్దు కాలేదని, ఈనెల 7–14 తేదీల్లో ప్రియాంకాగాంధీ మహబూబ్‌నగర్ జిల్లాకు వస్తారని కానీ పార్టీ కార్యకలాపాల్లో విస్తృతంగా పాల్గొనేందుకే ఖర్గే సమక్షంలో జూపల్లి అండ్ టీం ఢిల్లీ వెళ్లి పారీ్టలో చేరుతోందని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment