కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితో రాజేష్‌రెడ్డి
సాక్షి, మహబూబ్‌నగర్: అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఐదుసార్లు ఓటమి చవిచూసిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కలను ఆయన కొడుకు కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి నెరవేర్చారు. పోటీ చేసిన మొదటిసారే గెలుపొందడం మరో విశేషం. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి 1999లో మొదటిసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేకు పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2004లో అప్పటి టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసినా 1,449 స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు.
తర్వాత 2009, 2012 ఎన్నికల్లో సైతం నాగం జనార్దన్‌రెడ్డి చేతిలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2005లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా, 2016, 2022లో ఎమ్మెల్సీ పదవులు దక్కినా ఎమ్మెల్యే పదవి మాత్రం అందని ద్రాక్షగా మారింది. అయితే తన కోరికను తన కొడుకు నెరవేర్చడంతో కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
ఇవి చదవండి: 20 ఏళ్లలో ఏనాడూ చూడని 'హస్తం' హవా..! మళ్లీ ఇప్పుడు
Comments
Please login to add a commentAdd a comment