వెండి రథోత్సవ శోభ
శ్రీశైలం: శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయప్రాంగణంలో సోమవారం వెండి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం రాత్రి వైభవంగా సహస్రదీపార్చనను నిర్వహించారు. సహస్రదీపార్చన కార్యక్రమం ముగిశాక స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండిరథంపై ఆధిష్టింపజేసి విశేష పూజలను జరిపారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ చేయించారు. వందలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్ల సహస్రదీపార్చన సేవ, వెండిరథోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు.