మల్లన్నసాగర్ నిర్వాసితులకు అన్యాయం చేయెుద్దు
Published Wed, Jul 27 2016 12:20 AM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM
హన్మకొండ: మల్లన్న సాగర్ ప్రాజñ క్టు నిర్వాసితులకు అన్యాయం చేయవద్దని తెలంగాణ విద్యా వంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జగదీశ్వ ర్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ చం ద్రభాను అన్నారు. మంగళవారం హన్మకొండలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం .. 2013 భూసేకరణ, పునరావాస చట్టంపై రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో 14 గ్రామాల ప్రజలు నిర్వాసితులవుతున్నారని అన్నారు. ప్రభుత్వం కొత్తగా 123 జీఓను తీసుకిచ్చి ఇళ్లు నిర్మిస్తామని ఒప్పించి బలవంతంగా భూములు లాక్కొనే ప్ర యత్నం చేస్తోందని ఆరోపించారు. దీనిపై ఆం దోళన చేస్తున్న నిర్వాసితులపై లాఠీ చార్జి చేయ డం అమానుషమని పేర్కొన్నారు. ప్రజలు ని ర్వాసితులు కాకుండా గొలుసుకట్టు చెరువులు నిర్మించాలని, చిన్న నీటి వనరులతో నష్టం జరుగకుండా చూడాలని డిమాండ్ చేశా రు. సమావేశంలో టీవీవీ జిల్లా ఉపాధ్యక్షులు విద్యాసాగర్,బొనగాని రవీందర్, నాయకులు షేక్ జావి ద్, లక్ష్మయ్య, ప్రొఫెసర్ రమ పాల్గొన్నారు.
Advertisement