కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రాకుండానే టెండర్లు పిలవడంపై హైకోర్టు
పర్యావరణ అనుమతులు లేకుండా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని, ఇది చట్ట విరుద్ధమంటూ వేములఘాట్‌కు చెందిన గండ్ల లక్ష్మి, మరో ఐదుగురు వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది సీహెచ్ రవికుమార్ వాదనలు వినిపించారు.