మల్లన్నసాగర్లో పోలీస్ రాజ్యం: పొన్నాల | Ponnala Lakshmaiah fired on pilice department | Sakshi
Sakshi News home page

మల్లన్నసాగర్లో పోలీస్ రాజ్యం: పొన్నాల

Published Sun, Aug 7 2016 1:18 AM | Last Updated on Mon, Oct 8 2018 9:00 PM

మల్లన్నసాగర్లో పోలీస్ రాజ్యం: పొన్నాల - Sakshi

మల్లన్నసాగర్లో పోలీస్ రాజ్యం: పొన్నాల

సాక్షి, న్యూఢిల్లీ: మల్లన్నసాగర్ పరిసర ప్రాంతాల్లో పోలీసు రాజ్యం నడుస్తోం దని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్వాసిత ప్రాంతాల్లో పోలీసుల బలగాలతో బాధిత రైతులను అష్ట దిగ్బంధం చేశారని, నాయకులెవరినీ అటువైపు వెళ్లకుండా చూస్తున్నారన్నారు.

ప్రధాని పర్యటన నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత కనిపించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కేంద్రం నుంచి  రాష్ట్రానికి అందాల్సిన సాయం, పెండింగ్ అం శాలను వివరించేందుకు ప్రధాని అపాయింట్‌మెంట్ కోరామని పొన్నాల తెలిపారు. అయితే ఇంతవరకు సానుకూల స్పందన రాలేదన్నా రు. అపాయింట్‌మెంట్ లభిస్తే ప్రధానితో వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధుల కేటాయింపు అంశాన్ని అడుగుతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement